తన కెరీర్‌లో రెండు మూడు చిత్రాలు మినహా సమంత నటించిన చిత్రాలలో నటన కంటే గ్లామర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది. దాని ద్వారానే ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ త్వరలో ఈమె ఎంతో పేరు ప్రఖ్యాతులున్న అక్కినేని వారి ఇంటి కోడలు కానుంది. దాంతో ఆమెతో చిత్రాలు చేయాలనుకునే వారికి ఆమె పాత్రను డిజైన్ చేయడం కత్తి మీద సాముగా మారింది. ఆమె ఇమేజ్‌కు డామేజ్ కలగకుండా, ఆమెను అక్కినేని ఇంటి కోడలిగా భావిస్తూ ఆమె పాత్రలను ఎంతో హొందగా డిజైన్ చేయాల్సివస్తోంది. తన కెరీర్‌లో 'అ...ఆ' తప్ప పెద్దగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో సమంత నటించలేదు. 'అ..ఆ' కూడా పూర్తి లేడీ ఓరియంటెడ్ మూవీ కాదు. కాగా ప్రస్తుతం ఆమె 'రాజుగారిగది2'లో ఓ వైవిధ్యమైన పాత్రను చేస్తోంది.
ఇక సుక్కు-చరణ్‌ల చిత్రంలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా ఓ పర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రను చేయనుంది. ఇక తన కెరీర్‌లో మొదటిసారిగా కన్నడలో వచ్చిన 'యూటర్న్' అనే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేయనుంది. ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు పవన్‌కుమార్ ఏకకాలంలో సమంతతో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇక మహానాటి సావిత్రి బయోగ్రఫీలో కూడా ఆమె కీలకపాత్రను చేయనుంది. తమిళంలో విజయ్‌సేతుపతి, విజయ్, విశాల్‌లతో చేసే చిత్రాలలో ఆమె చేసే పాత్రలు కూడా అసభ్యతకు, గ్లామర్‌షోకు దూరంగా విభిన్నంగా ఉంటాయట. మొత్తానికి సమంత తన కెరీర్ చివరి దశలో తనదైన ముద్రను వేసి, తనకు నటిగా మంచి స్కోప్ ఉన్న చిత్రాలనే ఎంచుకుంటోంది. ఇక చైతూ-సమంతల వివాహం అనుకున్న తేదీ కంటే ముందే జరగనుందనే వార్తల నేపథ్యంలో తెలుగు దర్శకనిర్మాతలను పక్కనపెడితే విజయ్, విజయ్ సేతూపతి, విశాల్ చిత్రాల దర్శకనిర్మాతలు, హీరోలు తలలు పట్టుకుంటున్నారు.