ఇటీవల రానా హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఘాజీ' చిత్రం మంచి కలెక్షన్లు, ప్రశంసలు పొందుతున్నప్పటికీ ఈ చిత్రంలో తాప్సి పోషించిన పాత్రపై మాత్రం విమర్శలు వచ్చాయి. తాప్పి ఆ పాత్రను ఎందుకు చేసిందా? అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇక తాజాగా తాప్సి నటించిన చిత్రం 'నామ్ షబానా' చిత్రం హిందీలో తెరకెక్కుతోంది. 'బేబి' చిత్రంలో తాప్సి పోషించిన షబానా పాత్రకు ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో తాప్సి, అక్షయ్‌కుమార్, అనుపమ్‌ఖేర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నీరజ్ పాండే కథ, స్క్రీన్‌ప్లేలను అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ 'నా పేరు షబానా' తెలుగు టీజర్ కూడా విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో తాప్పి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఓ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏజెంట్‌గా నటిస్తోంది. దేశరక్షణ కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటాలు, యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రం తాప్సి కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మార్చి 31న ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.