చిరు బుల్లితెర ఎంట్రీ ఇస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు.కానీ ప్రత్యేక కారణాల వల్లనో, లేక అభిమానుల ఆశ ఫలించో గానీ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగోసీజన్‌కు చిరు హోస్ట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చిరు 150వ చిత్రం మ్యాజిక్ చేసిన నేపథ్యంలో ఈ బుల్లితెర షో భారీస్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందని మెగాభిమానులు ఎన్నోఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ షోకు ఎన్ని ప్రమోషన్స్ చేసినా, ఎంతమంది అతిథులను పిలిచినా, కేవలం 5.8 రేటింగ్‌ను మాత్రమే సాధించింది.
ఇక అదే సమయంలో అనసూయ హోస్ట్ చేస్తూ జెమిని చానెల్‌లో ప్రసారమవుతున్న 'జాక్‌పాట్'షోకి ఏకంగా 6.5 టీఆర్పీ వచ్చి, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఇది ఎగ్జామ్స్ సీజన్ కావడంతో పిల్లలు, తల్లిదండ్రులు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోని చూడకుండా రిమోట్‌లు ఆఫ్ చేస్తున్నారని మెగాభిమానులు వంకగా చూపుతున్నారు. కానీ అదే సమయంలో ఇతర ప్రోగ్రామ్స్‌కి మాత్రం అంత టీఆర్పీలు ఎలా సాధ్యమయ్యాయనే విమర్శ వస్తోంది. ఇక చిరు షోకు టీఆర్పీలను ఎలా పెంచాలి? కార్యక్రమంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి? ఎలా వీక్షకులను ఆకట్టుకోవాలి? ఎవరెవరిని అతిథులుగా పిలవాలి? అనే విషయంలో నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. మొత్తానికి అనసూయ జోరు ముందు చిరు కూడా బేజారు పడుతున్నాడనే విషయాన్ని మాత్రం యాంటీ మెగాఫ్యాన్స్ అస్త్రంగా వాడుకుంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.