ప్రస్తుతం వరుస బ్లాక్‌బస్టర్స్‌తో స్లైలిష్‌స్టార్ బన్నీ సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'డిజె'పై కూడా భారీ అంచనాలున్నాయి. ఇక ఇందులో బన్నీ బ్రాహ్మణ యువకునిగా తనలోని పూర్తి కామెడీకోణాన్ని బయటకు తీస్తున్నాడనే ప్రచారంతో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి. కానీ ఈ చిత్రం టీజర్‌ను చప్పగా కట్ చేశారని, కేవలం ఒకే ఒక్క డైలాగ్‌తో నిరాశపరిచి, డిజప్పాయింట్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువైంది.
కాగా ఈ చిత్రానికి తాను నిర్మాతను కాకపోయినా తన కుమారుడి చిత్రం కాబట్టి అల్లు అరవింద్ ఈ విషయం టీజర్ మేకింగ్‌లో జోక్యం చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. స్వతహాగా టీజర్, ట్రైలర్స్‌ను కట్ చేయడంలో హరీష్‌శంకర్,దిల్‌రాజులు మంచి ప్రావీణ్యం ఉన్నవారు. కానీ రిలీజ్‌కి చాలాసమయం ఉన్నందున ఇప్పటి నుండే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సినిమాకి మంచిది కాదని భావించిన అల్లు అరవింద్ ఈ చిత్రం టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాకుండా తగిన శ్రద్ద తీసుకున్నాడని, కాబట్టే ఈ టీజర్ ఈ చిత్రానికి పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోతోందని, ఈ విషయంలో అల్లు ఇచ్చిన సలహాను హరీష్‌శంకర్, దిల్‌రాజులు తూచా తప్పకుండా ఫాలోఅయ్యారనే ప్రచారం ఊపందుకుంది.
కేవలం సినిమా పాటలు, థియేటికల్ ట్రైలర్, ప్రీరిలీజ్ ఫంక్షన్ వంటి వాటి సమయం నుంచి మాత్రమే ఈ చిత్రానికి అంచాలు పెంచాలని, అప్పటివరకు ఎలాంటి విషయాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అల్లు అరవింద్ 'డిజె' యూనిట్‌ను ఆదేశించారనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది.