తెలుగు నవతరం దర్శకుల్లో పూరీజగన్నాథ్‌ది మొదటి నుంచి డిఫరెంట్ ట్రెండ్. ఆయన స్టైలే వేరు. ఆయన తన కెరీర్‌లో ఇప్పటికే పడటం.. గోడకు కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో లేవడం ఆయనకే చెల్లు. ఇక 'జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం' చిత్రాల తర్వాత మాత్రం పూరీ పని ఇక అయిపోయిందనే విమర్శలు వచ్చాయి. చిరు, వెంకీ, జూనియర్, మహేష్ నుంచి రవితేజ, రామ్‌ల వరకు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. ఇదేమీ పూరికి కొత్తకాదు. దీంతో ఆయన స్టామినా, కసి తెలిసిన బాలయ్య తన 101వ చిత్రానికి ఆయనకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో ఆయన సంకుచితుడైన నిర్మాత సి.కళ్యాణ్‌కు అవకాశం ఇస్తాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయనకు భవ్య ఆర్ట్స్ అధినేత ఆనంద్‌ప్రసాద్ వంటి మంచి వ్యక్తి తోడు లభించడం పూరీకి నిజంగా వరంగానే చెప్పుకోవాలి. ఇక పూరీ మాత్రం ఈసారి తన చిత్రాలను చుట్టేస్తాడనే విమర్శలకు చెక్ పెట్టనున్నాడని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే తన వద్ద స్క్రిప్ట్ రెడీ ఉన్నా కూడా బాలయ్యకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 9న కేవలం లాంఛనంగా ప్రారంభిస్తారు. సో..పూరీ దృష్టిలో ఆయన ఈ చిత్రం స్క్రిప్ట్‌కు ఎక్కువ కాలం పనిచేస్తున్నాడనే చెప్పాలి.
స్టోరీ కోసం, ప్రీప్రొడక్షన్ కోసం సమయం కేటాయించినా కూడా సినిమా మొదలైన తర్వాత మాత్రం తనదైన పంథాలోనే ఈ చిత్రాన్ని వీలైనంత స్పీడ్‌గా చేయడానికి వ్యూహ రచన చేస్తున్నాడు. దీనికి బాలయ్య, నిర్మాతల నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించింది. సో.. ఈ చిత్రం ప్రకటన రోజునే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తామని ప్రకటించడం విశేషమే. ఇప్పటి వరకు సీనియర్ స్టార్స్‌లో ఆయన నాగ్‌తో 'సూపర్, శివమణి' చిత్రాలు చేశాడు. ఇక ఇప్పుడు బాలయ్యతో చేస్తున్నాడు. ఈ చిత్రం విజయం సాధిస్తే మాత్రం చిరు నుంచి వెంకీ వరకు, మహేష్ నుంచి రామ్ వరకు మరలా ఆయన దగ్గర క్యూకట్టడం ఖాయమని చెప్పవచ్చు.