Advertisementt

కుర్ర హీరోలకు అగ్నిపరీక్ష...!

Sun 26th Feb 2017 06:11 PM
young heroes,rajtarun,manchu manoj,vijay devarakonda  కుర్ర హీరోలకు అగ్నిపరీక్ష...!
కుర్ర హీరోలకు అగ్నిపరీక్ష...!
Advertisement
Ads by CJ

మార్చి 3వ తేదీన ముగ్గురు యంగ్‌ హీరోలకు అసలుసిసలైన పరీక్ష జరగనుంది. ఇప్పటికే యంగ్‌హీరోలలో ముందున్న రాజ్‌తరుణ్‌ నటిస్తున్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అ రోజున విడుదల కానుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌ జోనర్‌గా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే అర్ధమవుతోంది. ఇక ట్రైలర్‌లోని డైలాగ్‌లు, 'జానీ జానీ యస్‌ పాపా....' వంటి పాటలు యూత్‌ నుంచి పిల్లల వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

ఈమధ్య వరుస విజయాలలో ఉన్న రాజ్‌తరుణ్‌కు 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు', 'వీడో రకం.. వాడో రకం' చిత్రాలు పెద్ద విజయాన్ని అందించలేదు. మరోపక్క ఆయనకు గర్వం పెరిగిందని, దిల్‌రాజు, సీనియర్‌ వంశీ తెరకెక్కిస్తున్న 'లేడీస్‌ టైలర్‌' సీక్వెల్‌లో చాన్స్‌ వచ్చినా, ఆయన తన పొగరుబోతుతనంతో పొగొట్టుకున్నాడనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ఆయనకు అగ్నిపరీక్షేనని చెప్పాలి. ఇక వరుసగా విభిన్న చిత్రాలు చేస్తున్నా మంచి విజయం అందుకోలేకపోతున్న, చివరకు బాలయ్య వంటి స్టార్‌ అండదండలు ఇచ్చిన 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' కూడా పెద్దగా ఆడకపోవడంతో మంచు మనోజ్‌కు తాజాగా సత్య అనే దర్శకునితో చేస్తున్న పక్కామాస్‌ చిత్రం 'గుంటూరోడు' కీలకంగా మారింది. 

ఈ చిత్రం ట్రైలర్‌ కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి చిరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం కూడా ఈ సినిమాకి ప్లస్‌ కానుంది. ఇక 'పెళ్లిచూపులు'తో అతి పెద్ద హిట్‌ను కొట్టిన హీరో విజయ్‌ దేవరకొండ. 'పెళ్లిచూపులు' చిత్రం తనకు ఏదో అదృష్టం కొద్ది వచ్చిన విజయం కాదని మార్చి 3న విడుదల కానున్న 'ద్వారకా' చిత్రంతో తనను తాను ప్రూవ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తే అసభ్యతకు తావులేకుండా విభిన్నంగా తెరకెక్కించారని అర్ధమవుతోంది. 

ఈ చిత్రం హిట్‌ అయితే విజయ్‌ దేవరకొండతో వరుస చిత్రాలు చేయడానికి ఎందరో బడా నిర్మాతలు ముందుకు రానున్నారు. మొత్తానికి మార్చి3వ తేదీ ఈ కుర్రహీరోలు ముగ్గురికి అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఇక 'ద్వారక' చిత్రంలో ఆర్‌బి.చౌదరి కూడా భాగస్వామి కావడంతో ఈ చిత్రానికి లభించే ఆదరణపై మంచి అంచనాలే ఉన్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ