Advertisementt

భావన చాల గ్రేట్ కదా..!

Sun 26th Feb 2017 05:18 PM
malayalam,heroine bhavana,bhavana kidnap,bhavan restart to shooting  భావన చాల గ్రేట్ కదా..!
భావన చాల గ్రేట్ కదా..!
Advertisement
Ads by CJ

మలయాళ నటి భావనపై జరిగిన లైంగిక దాడి గురించి అందరికి తెలిసిందే.. ఈ దాడులకు పాల్పడిన కొంతమంది నిందితులని పోలీస్ లు పట్టుకుని రిమాండ్ కు తరలించిన విషయము తెలిసిందే. ఇంకా కొంతమంది భావన కేసులో ఇన్వాల్వయ్యి ఉండడంతో ఈ కేసు జటిలంగా మారిందని... వారిని కూడా పట్టుకుని జైల్లో పెడతామని పోలీసులు చెబుతున్నారు. ఇక మాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతా భావనకు మద్దతు తెలిపారు. మలయాళ పరిశ్రమలోని బడా వ్యక్తులకి ఈ కేసుకు సంబంధం ఉందని ప్రచారం జరుగుతుండగా.... భావన మాత్రం తనని వేధించిన వాళ్ళకి శిక్ష పడేవరకు సినిమా షూటింగ్ లో పాల్గొనని చెప్పినట్లు టాక్ బయటికి వచ్చింది. ఈ టాక్ తో ఇక భావన కెరీర్ ప్రమాదంలో పడినట్లే అని ప్రచారం జరుగుతున్న వేళ భావన మళ్లీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి రెడీ అయ్యిందని అంటున్నారు.

ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రం షూటింగ్ భావనపై జరిగిన కిడ్నాప్ ఘటన వల్ల వాయిదా పడడంతో ఇప్పుడు మళ్లీ భావన షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో తిరిగి షూటింగ్ జరుపుకుంటుందని భావన సహా నటుడు పృద్వి రాజ్ తెలిపారు. ఇలా భావన తనకు జరిగిన దాడి నుండి పూర్తిగా బయటపడి షూటింగ్ లో పాల్గొనడం తమకు సంతోషాన్నిచ్చిందని సహా నటులు చెబుతున్నారు. అంతటి మానసిక ఆందోళనకు గురైన భావన త్వరగా కోలుకుని అందులో నుండి బయటపడి ఇలా మళ్లీ అందరితో కలిసిపోవడంతో భావనకు అందరూ హాట్స్ ఆఫ్ చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ