Advertisementt

ఎన్టీఆర్ చిత్రం పై ఒక సీక్రెట్ తెలుసా..?

Sun 26th Feb 2017 05:00 PM
junior ntr,producer kalyan ram,director boby,jai lava kusha movie  ఎన్టీఆర్ చిత్రం పై ఒక సీక్రెట్ తెలుసా..?
ఎన్టీఆర్ చిత్రం పై ఒక సీక్రెట్ తెలుసా..?
Advertisement
Ads by CJ

'టెంపర్' దగ్గర నుండి ఎన్టీఆర్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక 'నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్' హిట్స్ తో ఎన్టీఆర్ రేంజ్ తోపాటు అతనికి భారీ డిమాండ్ కూడా ఏర్పడింది. మొదటిసారిగా 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో 50  కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' తో కలెక్షన్స్ మోత మోగించేసి తాను బాక్స్ ఆఫీస్ ని దడ దడలాడించగలనని ప్రూవ్ చేసాడు. 'జనతా గ్యారేజ్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మించే చిత్రంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ - బాబీ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిపోయి సెట్స్ మీదకి వెళ్ళిపోయింది. 'జై లవ కుశ' అనే టైటిల్ కూడా ఈ చిత్రానికి ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నప్పటికీ ఇంతవరకు అదే... ఎన్టీఆర్ చిత్ర టైటిల్ అని అధికారిక ప్రకటన చెయ్యలేదు.

అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రం గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఈ చిత్రం మొదలై ఒక వారం రోజులు షూటింగ్ చేసుకుందో లేదో అప్పుడే దీనికి భారీ డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. అదేమిటంటే ఎన్టీఆర్ గత చిత్రాల వలే ఈ చిత్రం కూడా కలెక్షన్స్ ని కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయంతో భారీ నిర్మాతల్లో ఒకరు ఈ చిత్రానికి కళ్ళు చెదిరే భారీ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు.  ఎన్టీఆర్ - బాబీ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ చిత్రాన్ని తనకి అమ్మమని 85  కోట్ల భారీ ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. తాను ఎలాగైనా ఎన్టీఆర్ చిత్రాన్ని చేజిక్కించుకోవడానికి మరో ఐదు కోట్లు ఇవ్వడానికి కూడా ఆ నిర్మాత సిద్ధపడినట్లు చెబుతున్నారు.

అయితే ఆ నిర్మాతతో మూవీ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అసలు షూటింగ్ మొదలైన వారానికే  ఒక చిత్రానికి ఇలాంటి ఒక భారీ ఆఫర్ రావడం ఇదే మొదటిసారిగా టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ కి మంచి కథ, దర్శకుడు దొరకలే గాని అతని స్టామినినాని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక్క ఆఫర్ చాలు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ