ప్రభాస్ కెరీర్‌ను 'బాహుబలి' ముందు తర్వాత అని విభజించుకోవాలి. ఈ చిత్రం మొదటి పార్ట్ దేశవిదేశాలలో కూడా బాగా పాపులర్ అయింది. ఓ దక్షిణాది డబ్బింగ్ చిత్రం బాలీవుడ్‌లో 100కోట్లు కలెక్ట్ చేయడమంటే మాటలు కాదు. దానిని సుసాధ్యం చేసింది 'బాహుబలి1'. ఇక త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రం సెకండ్‌పార్ట్ కూడా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఒక్కసారిగా అన్ని భాషల్లో స్టార్‌హోదాను తెచ్చుకున్నాడు. దీంతో 'బాహుబలి2' తర్వాత ఆయన చేయబోయే సుజిత్ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కించాలని భావిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రభాస్‌తో ఏకంగా ఓ స్ట్రెయిల్ బాలీవుడ్ చిత్రం తీయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై ఇప్పటివరకు ప్రభాస్ పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా ఆయన ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. పలు బాలీవుడ్ కథలు కూడా తన వద్దకు వస్తున్నాయని బాలీవుడ్‌లోకి తప్పక వెళ్లాలని క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాదు.. మరో రెండు నెలలలోపే దీనిపై ప్రకటన కూడా చేస్తానని చెప్పడంతో యంగ్‌రెబెల్‌స్టార్స్ ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. గతంలో దక్షిణాది స్టార్స్ అయిన రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా బాలీవుడ్‌లో నటించారు. వారికి ఆదరణ లభించినా కూడా అక్కడి మేకర్స్, మీడియా మాత్రం వారిని చిన్న చూపు చూసింది . దాంతో వారికి బాలీవుడ్ కల నెరవేరలేదు. ఉత్తరాది వారు దక్షిణాది భామలైన శ్రీదేవి, జయప్రద వంటి వారిని ఆదిరిస్తారే గానీ మన హీరోలను మాత్రం వారు ఎంకరేజ్ చేయరు. మరి ప్రభాస్ ఈ విషయంలో ఎలా నెగ్గుకొస్తాడో చూడాల్సివుంది. మరోపక్క 'బాహుబలి' విజయాన్ని తలకు ఎక్కించుకొని, గర్వం పెంచుకోనని, తాను ఇంకా జాగ్రత్తగా, బాధ్యతగా పనిచేస్తానని ప్రభాస్ చెప్పడం హర్షణీయం.