Advertisementt

బండ్ల ఇంటర్వ్యూపై సర్వాత్రా ఆసక్తి..!

Sun 26th Feb 2017 03:56 PM
bandla ganesh,producer,side hero,abn andhrajyothi channel interview  బండ్ల ఇంటర్వ్యూపై సర్వాత్రా ఆసక్తి..!
బండ్ల ఇంటర్వ్యూపై సర్వాత్రా ఆసక్తి..!
Advertisement

చిన్న చిన్న కమెడియన్‌గా, నలుగైదుగురు హీరో స్నేహితుల బ్యాచ్‌లో ఒకడిగా వేషాలు వేసుకునే బండ్లగణేష్‌ ఒక్కసారిగా బడా నిర్మాత అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరసగా స్టార్స్‌ చిత్రాలను నిర్మిస్తూ, బ్లాక్‌బస్టర్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఇంత డబ్బు ఎలా వచ్చిందా? అనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి. బొత్స సత్యనారాయణకు బినామీ అనే పేరు కూడా వచ్చింది. దీనికి సాక్ష్యాత్తూ ఆనాడు అసెంబ్లీలో జరిగిన ఓ చిన్న సంఘటనే ఉదాహరణ. 

బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి రవితేజ హీరోగా నిర్మించిన చిత్రం విడుదలై మొదటి వారం మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. దీంతో కొంతమంది బొత్స స్నేహితులైన ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే అసెంబ్లీ లాబీలోనే బొత్స వద్దకు వెళ్లి ఆయన సినీ ఇండస్ట్రీలో కూడా మొదటి సక్సెస్‌ను సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. బొత్స కూడా చిరు నవ్వులు చిందించాడు. ఇక ఓ ఆడియోవేడుకలో బండ్ల గణేష్‌ ఆవేశంగా మాట్లాడుతూ, తాను మర్డర్‌ చేసి వచ్చినా బొత్స తనను కాపాడుతాడని వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అదే బండ్ల మాట మార్చాడు. తాను ఎవ్వరికీ బినామీని కాదని, తన తండ్రి, తాను వ్యాపారవేత్తలమని, కోట్లకు అధిపతులమని సెలవిచ్చాడు. 

కాగా ఇటీవల ఆయన కొన్ని యూట్యూబ్‌ చానెల్స్‌లో ఇచ్చిన ఇంటర్వ్ల్యూలలో చేసిన వ్యాఖ్యలు కూడా బాగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే యూట్యూబ్‌ను చూడని వారికి అవి పెద్దగా ఎక్కలేదు. ఇక ఈ రోజు ఆయన ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతిలో వేమూరి రాధాకృష్ణతో ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే'లో కనిపించనున్నాడు. ఇప్పటికీ ఈ ప్రోమోలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో పలువురు ఈ రోజు ప్రసారమయ్యే ఆ ఇంటర్వ్యూపై అధిక ఆసక్తి చూపుతున్నారు. ఈ ఇంటర్వ్యూలో కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను బొత్సకి బినామీని కాదని, తాను మర్డర్‌ చేసి వచ్చానా బొత్స తనను కాపాడుతాడని తొందర పడి వ్యాఖ్యలు చేశానని, ఆ ముద్ర పోగొట్టుకోవడానికి పదేళ్లు పట్టిదంటూ తెలిపాడు. 

ఇక స్టార్‌ హీరోలను మచ్చిక చేసుకొని, వారి డేట్స్‌ సంపాదించేది తనకు మాత్రమే తెలిసిన విద్య అని, దానిని పది మందికి బహిరంగంగా ఎలా చెబుతానని చెప్పాడు. ఇక ఎన్టీఆర్‌, రవితేజ, పవన్‌ వంటి హీరోలతో తన సంబంధాల గురించి కూడా వ్యాఖ్యానించాడు. వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడ్‌ అని, పవన్‌ జనసేన విజయం సాధించడం ఖాయమని తెలిపినట్లు, తనకు ఎంపీ కావాలనే కోరిక ఉన్నట్లు ఆయన తెలిపాడని సమాచారం. మరి ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాన్ని పూర్తిగా చూసిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రావచ్చు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement