Advertisementt

చిరుపై వస్తున్న విమర్శలు నిజమేనా..?

Sun 26th Feb 2017 03:43 PM
chiranjeevi,meelo evaru koteeswarudu program,nagarjuna,star maa channel  చిరుపై వస్తున్న విమర్శలు నిజమేనా..?
చిరుపై వస్తున్న విమర్శలు నిజమేనా..?
Advertisement

చిరంజీవికి స్వతహాగా సమయస్ఫూర్తిగా మాట్లాడటం పెద్దగా చేతకాదనే పేరుంది. ఇక బుల్లితెరపై అదే ముఖ్యం. సినిమాలలోగా ముందు స్క్రిప్ట్‌ రెడీ చేసుకొని అదరగొట్టే వీలు పెద్దగా ఉండదు. ఇక ప్రస్తుతం చిరు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్‌4కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చాలా మంది గత మూడు సీజన్లకు పనిచేసిన నాగ్‌లాగా చిరు రాణించలేకపోతున్నాడని అంటున్నారు. ఇక చిరు వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమానికి పెద్దగా టీఆర్పీలు రావక పోవడం నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది. 

ఇక నాగ్‌ హోస్ట్‌ చేసిన మొదటి సీజన్‌కు వచ్చిన టీఆర్పీలు అద్భుతం. కానీ ఆయనే హోస్ట్‌ చేసిన మిగిలిన రెండు సీజన్లకు కూడా తక్కువ ఆదరణే లభించింది. అంటే మొదటి సీజన్‌ తర్వాత నుంచే అంటే నాగ్‌ ఉన్నప్పటి నుంచే దీనికి ఆదరణ తగ్గుతూ వస్తున్నదనే మాట వాస్తవం. దాంతో నాగ్‌ని వీక్షకులు మొనాటనీగా ఫీలయ్యారమోనని నిర్వాహకులు చిరుని ఎంపిక చేసుకున్నారు. కానీ చిరు వచ్చిన తర్వాత కూడా టీఆర్పీలలో వృద్ది కనిపించడం లేదు. 

దీనికి కొందరు మెగాఫ్యాన్స్‌ తమిళ రాజకీయాలు మంచి రసవత్తరంగా నడుస్తుండటం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కడంతో ఎక్కువ మంది 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సమయంలో కూడా న్యూస్‌ చానెల్స్‌ వైపు ఎక్కువగా ఆసక్తి చూపించారనే వాదనకు తెరలేపారు. మరోవైపు చిరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే అతిథులుగా మంచి మంచి సెలబ్రిటీలను తెప్పించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదిఏమైనా ఇప్పుడు తమిళ రాజకీయాల వేడితగ్గింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి కూడా తగ్గింది. మరి రేపటి నుంచి ప్రసారమయ్యే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం ఈసారైనా మంచి టీఆర్పీలను సాదిస్తుందో లేదో ఎదురుచూడాల్సివుంది....! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement