Advertisementt

అనుష్క స్లిమ్ కు కారణం తెలుసా..?

Sun 26th Feb 2017 03:33 PM
heroine anushka,baahubali 2 movie,director ss rajamouli  అనుష్క స్లిమ్ కు కారణం తెలుసా..?
అనుష్క స్లిమ్ కు కారణం తెలుసా..?
Advertisement
Ads by CJ

అగ్రశ్రేణి నటీమణిగా టాలీవుడ్ ను ఏలుతున్న హీరోయిన్ అనుష్క.  సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క విపరీతంగా లావై బరువు పెరిగిన విషయం తెలిసిందే. అంతటి బరువు నుండి బయటకు రావడానికి అనుష్క ఇంకా ఆప‌సోపాలు ప‌డుతోంది. అనుష్క ఇంకా బొద్దుగా ఉంద‌ని చెప్పడానికి సింగం 3 చిత్రం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే... ఉన్నట్టుండి ఒక్కసారిగా బాహుబ‌లి 2 చిత్రంలో అనుష్క చాలా స్లిమ్ గా మారిపోయింది. బాహుబ‌లి రెండవభాగానికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో అనుష్క స్లిమ్ గా క‌నిపించి అంద‌రినీ  ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. కాని అనుష్కకు సంబంధించి విడుదల చేసిన ఆ పోస్టర్ బాహుబ‌లి మొదటి భాగానికి తీసిన స్టిల్ అని... కొంతమంది భావిస్తే, అలాంటిదేం కాదు రాజమౌళి గ్రాఫిక్స్ సహాయంతో అనుష్కను స్లిమ్ గా చూయించాడని కొందరు అనుకున్నారు.

కానీ తాజాగా రాజమౌళి మాట్లాడుతూ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.  బాహుబలి 2లో అనుష్క స్లిమ్ గా క‌నిపించ‌డానికి కార‌ణం సీజీ వ‌ర్కే అని రాజ‌మౌళి చెప్పేశాడు. ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.... సైజ్ జీరో కోసం భారీస్థాయిలో బ‌రువు పెరిగిన అనుష్క‌.. బాహుబ‌లి 2 కోసం బ‌రువు త‌గ్గ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించింద‌న్నాడు. అయితే.. అనుష్క పోస్ట‌ర్ లో చూపించినంత స‌న్నగా లేక‌పోయినా, జ‌నాలు భావించేటంత లావుగా లేదని రాజమౌళి వివరించాడు. అనుష్క‌ అలా చూపించ‌డానికి సీజీ వ‌ర్క్‌పై ఆధార‌ప‌డ్డామ‌ని రాజ‌మౌళి ఒప్పేసుకున్నాడు. అనుష్కను అలా చూయించడం అంత నేరమేం కాదని, అది చాలా సాధారణ విషయంగా తేల్చి చెప్పాడు రాజమౌళి. అయితే అనుష్క కారణంగానే బాహుబ‌లి 2 ఆల‌స్య‌మైంద‌న్న విషయాన్ని తాను పూర్తిగా ఖండిస్తున్నాని రాజమౌళి తెలిపాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ