Advertisementt

వాళ్ళు కూడా నాగ్ ని బాధ పెడతారా..?

Sun 26th Feb 2017 01:04 PM
naga chaitanya,samantha,akhil,nagarjuna,shriya bhupal  వాళ్ళు కూడా నాగ్ ని బాధ పెడతారా..?
వాళ్ళు కూడా నాగ్ ని బాధ పెడతారా..?
Advertisement
Ads by CJ

అఖిల్ - శ్రీయ భూపాల్ పెళ్లి రద్దయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నా అటు జివికె ఫ్యామిలీ గాని ఇటు అక్కినేని ఫ్యామిలీ గాని ఇప్పటివరకు ఆ రూమర్స్ ని ఖండించలేదు. అంటే ఈ రూమర్స్ నిజమేనా అనే అనుమానం కలుగక మానదు. ఇక నాగ్ గత వారం రోజుల నుండి  బయట ఎక్కడా కనబడకుండా అజ్ఞాతవాసం గడుపుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అది నిజమే అనిపించేలా మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు పెళ్ళికి టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు వచ్చినా నాగార్జున మాత్రం ఆ ఫంక్షన్ లో కనబడలేదు. అంటే నాగ్, అఖిల్ మ్యారేజ్ విషయంలో బాధపడడం వల్లే ఈపెళ్లికి హాజరవలేక పోయాడని అంటున్నారు.

మరి అఖిల్ పెళ్లి రద్దవ్వడం వల్ల ఇప్పుడు నాగ్..... నాగ చైతన్య - సమంతల పెళ్లి అఖిల్ పెళ్లి జరిగే టైమ్ కి చెయ్యాలని అనుకుంటున్నాడట. అఖిల్ పెళ్లి ఈ ఏడాది మే లో చేసేసి... నాగచైతన్య పెళ్లి ఈ ఏడాది చివరిలో చెయ్యాలని నాగార్జున భావించాడు. ఇప్పుడు అనుకోని అవాంతరాల వల్ల అఖిల్ పెళ్లి ఆగిపోవడం వల్ల అఖిల్ పెళ్లి టైమ్ అంటే ఈ మే లోనే నాగ చైతన్య - సమంత ల పెళ్లి చెయ్యడానికి నాగ్ సైలెంట్ గా ఏర్పాట్లు చేస్తున్నాడని చెబుతున్నారు. 

మరి నాగ్ నిర్ణయానికి నాగ చైతన్య గాని సమంత గాని ఇంకా ఒకే చేయలేదట. ఎందుకంటే వీరి పెళ్ళికి ఈ ఏడాది చివరివరకు టైమ్ ఉండడం వలన వీరిద్దరూ ఈ గ్యాప్ లో రెండు సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల పెళ్లి ఇప్పుడు మే లో గనక జరిగితే మళ్లీ డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల వీరు తన నిర్ణయాన్ని అలోచించి చెబుతామని నాగ్ కి చెప్పినట్లు టాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ