విభిన్న చిత్రాలను, పాత్రలను ఎంపిక చేసుకుంటూ అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు. కాగా ఆయన ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'డిజె' (దువ్వాడజగన్నాథం) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దిల్‌రాజుకు 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో బన్నీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి మంచి స్పందన రాబట్టుకున్నారు. కానీ ఫస్ట్‌లుక్ విషయం వేరు. టీజర్ సంగతి వేరు. టీజర్‌లో మాత్రం ఈ చిత్రంలోని బన్నీ పాత్రలపై వస్తున్న సందేహాలకు కొంచెమైనా క్లూ ఇస్తారని అందరూ భావించారు. ఇందులో బన్నీ ఒకే పాత్రను చేస్తున్నాడని కొందరు... కాదు కాదు... బన్నీ పంతులు పాత్రతో సహా మరో పవర్‌ఫుల్ పాత్రను కూడా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో టీజర్‌లోనైనా ఈ విషయంలో కాస్త క్లూ అయినా ఇస్తారని ఎందరో ఎదురుచూశారు. కానీ ఈ టీజర్ కటింగ్‌లో మాత్రం యూనిట్ అదే సస్పెన్స్‌ను మెయిన్‌టెయిన్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
ఈ చిత్రంలోని కథ కూడా ఎక్కడా ఊహించలేని విధంగా టీజర్‌ను తీర్చిదిద్దారు. ఈ టీజర్ ప్రస్తుతం సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందులో పంతులు పాత్రలో బన్నీ అదరగొట్టాడు. తన బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డిక్షన్ వరకు ఆయన తీసుకున్న కేర్ చూసి ఔరా అంటున్నారు. ఇక ఇందులో పూజాహెగ్డే అందాల ఆరబోత కూడా ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుండటం విశేషం, చిరుకి ఓ 'చంటబ్బాయ్', నాగ్‌కు 'హలోబ్రదర్', ఎన్టీఆర్‌కు 'అదుర్స్'లా బన్నీకి 'డిజె' చిత్రం నిలుస్తుందని యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది. ఈ టీజర్ చూస్తే వారి నమ్మకం నిజమేనని ఒప్పుకోకతప్పదు. మొత్తానికి ఇప్పటివరకు బన్నీ తన కామెడీ కోణాన్ని పూర్తిగా బయటకు తీయలేదు. ఈ 'డిజె'తో బన్నీ అ బాకీ కూడా తీర్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ చిత్రం హరీష్ శంకర్‌కు 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది.