'బాహుబలి 2' పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న 'బాహుబలి 2' మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక 'బాహుబలి' చిత్రం మొదలెట్టినప్పటి నుండి ఇప్పటివరకు అనేకరకాల వార్తలు ప్రచురితమవుతున్నాయి. తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి అని ఒక పక్క పొగడ్తలు మరోపక్క రాజమౌళి ఇతర చిత్రాల నుండి 'బాహుబలి' కోసం కొన్ని సీన్స్ ని కాపీ చేస్తున్నాడని....వాదిస్తున్నారు. ఇకపోతే 'బాహుబలి 1' ఫస్ట్ లుక్ వదిలినప్పుడు అందులో నీళ్లలోంచి చేతితో బిడ్డను ఎత్తుకుని ఉన్న ఆ పోస్టర్ చూడగానే ఒక హాలివుడ్ ఫిలిం నుండి దీనిని కాపీ చేసాడని నానా యాగిచేసారు.
ఇక ఇప్పుడు మళ్లీ 'బాహుబలి 2' పోస్టర్ లో కూడా అలాగే తప్పులు వెతకడం స్టార్ట్ చేశారు సినీ విమర్శకులు. మొన్నామధ్యన విడుదల చేసిన ప్రభాస్, అనుష్క 'బాహుబలి 2' పోస్టర్ లో కూడా బాణం నుండి వెళ్లిన విల్లు లు తప్పుగా ఉన్నాయని.... వేలెత్తి చూపారు. ఇక ఇప్పుడు తాజాగా మహా శివరాత్రి శుభాకాంక్షలతో విడుదల చేసిన 'బాహుబలి 2' పోస్టర్ గురించి రచ్చ మొదలైంది. ప్రభాస్ ఏనుగు కుంభస్థలాన్ని అందుకున్నట్టు ఉన్న ఈ పోస్టర్ అందరిని విపరీతంగా ఆకర్షించింది. ఇంకా ఆ ఆకర్షణ ఏమోగానీ ఇది కూడా ఒక హాలీవుడ్ ఫిలిం నుండి రాజమౌళి కాపీ కొట్టాడని అప్పుడే ప్రూఫ్ లతో సహా బయటపెట్టేస్తున్నారు.
ఆ పోస్టర్ 'ఆంగ్ బ్యాక్-2' అనే హాలీవుడ్ ఫిలిం నుండి కాపీ కొట్టాడని ఆ పోస్టర్ కి ఈ పోస్టర్ కి లింక్ చేసి మరీ ప్రూఫ్ చూపించేస్తున్నారు. మరి ఇలా రాజమౌళి కాపీ కొట్టడంపై టాలీవుడ్ లో పెద్ద చర్చే మొదలైంది. అయినా ఏది కాపీ చేసి తీసినా రాజమౌళి మాత్రం తెలుగు సినిమాని ప్రపంచపటంలో నిలిపి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు. అలంటి రాజమౌళిని ఇలా విమర్శించడం తగదని అంటున్నారు.