పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు వంటి స్టార్స్‌ల ఇమేజ్‌ని వాడుకోవడానికి యంగ్ హీరోలు తపన చూపిస్తుంటారు. కానీ చాలా కాలం కిందటే సినీ ఫీల్డ్‌కు పరిచయమై, హీరోగా, విలన్‌గా, మరలా యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపీచంద్‌కి కూడా ఇప్పుడు పవన్ నామస్మరణ తప్పడంలేదు. 'సౌఖ్యం' చిత్రం తర్వాత ఈ మినిమమ్ గ్యారంటీ యాక్షన్ హీరో చాలా గ్యాప్ తీసుకున్నాడు. 2016లో ఆయన నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. ఆయన ఈ మధ్యకాలంలో అంత భారీ గ్యాప్ ఇప్పటివరకు తీసుకోలేదు. జయాపజయాలకు అతీతంగా కనీసం ఏడాదికి రెండు చిత్రాలు చేసేవాడు. అయినా కూడా ఈ ఏడాది ఆయన ఆ లోటును భర్తీ చేయనున్నాడు. మూడునెలల్లో మూడు చిత్రాలు విడుదల చేయడానికి ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నాడు.
ఆయన సంపత్‌నంది డైరెక్షన్‌లో నటిస్తున్న 'గౌతమ్ నంద' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సంపత్‌తో పాటు గోపీచంద్ కూడా కసిగా తీసుకొని పనిచేస్తున్నాడు. ఇందులో గోపీచంద్ లుక్ బాగా డిఫరెంట్‌గా ఉండి, అందరినీ అలరిస్తోంది. ఇక ఆయన ఎ.యం.రత్నం తనయుడు జ్యోతికృష్ణతో చేస్తున్న 'ఆక్సిజన్' అనే వెరైటీ చిత్రం షూటింగ్ కూడా చివరిదశకు వచ్చింది. 'గౌతమ్ నంద' విడుదలైన నెల గ్యాప్‌లోనే ఈ చిత్రం కూడా విడుదల కానుంది. ఇక ఆయన ఎప్పుడో మొదలుపెట్టి, ఎందరో దర్శకులు మారిన బి.గోపాల్ చిత్రం కూడా చివరి దశకు వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం నయనతార వల్ల ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తోంది.
కానీ దీనిలో నయన తప్పేమి లేదని, ఆమె ఇచ్చిన డేట్స్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోవడం, ఆమె తమిళంలో పలు చిత్రాలతో బిజీ కావడమే దీనికి కారణం అని సమాచారం. ఈ చిత్రానికి 'ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. కాగా 'గౌతమ్ నంద'తోపాటు 'ఆరడుగుల బుల్లెట్' కూడా పవన్‌కి చెందిన 'అత్తారింటికి దారేది' చిత్రానికే సంబంధించినది కావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇకపోతే 'గౌతమ్ నంద'లోని ఓ యాక్షన్ సీన్ గురించి కూడా ఓ వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో డజన్ మంది ఫైటర్స్‌తో గోపీచంద్ చేసే ఓ మాసీ ఫైట్‌ను కేవలం మూడు నిమిషాలలో తీసి, ఓకే చేశారట. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్‌లక్ష్మణ్‌లు కంపోజ్ చేయగా, దీనికోసం యూనిట్ ఓ వారం రోజుల పాటు రిహాల్సర్స్‌ని చేసిందట. ఇలా కేవలం మూడు నిమిషాలలో ఓ యాక్షన్ సీన్‌ని చిత్రీకరించడం ఇండియన్‌ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే మొదటి సారి అంటున్నారు.