పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కొత్త గెటప్‌లు, లుక్‌లు, జిమ్ వర్కౌట్లు తక్కువగా చేస్తుంటాడు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న వాడు కావడంతో ఆయనకు తన ఫిట్‌నెస్‌పై కమాండ్ ఉంది. ఇక సిక్స్‌ప్యాక్‌లపై వంటి వాటిపై మాత్రం ఆయన ప్రత్యేక ఆసక్తి చూపడనే టాక్ ఉంది. కాగా ప్రస్తుతం పవన్ 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన మధ్యవయస్కుడిగా, నలుగురు తమ్ముళ్లకు అన్నగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన మిడిల్ ఏజ్‌డ్‌గా కనిపించడానికి బరువుపెరిగి, కాస్త మాస్ లుక్ కోసం ప్రయత్నించాడు. ఈ విషయం టీజర్‌లో కూడా స్పష్టమైంది. కాగా ప్రస్తుతం పవన్-శృతిహాసన్‌లపై ఓ ఫోక్‌సాంగ్‌ను డాలీ చిత్రీకరిస్తున్నాడు.
మొదట ఈ పాటను విదేశాలలో చిత్రీకరించాలని భావించినప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల దీనిని హైదరాబాద్‌లోనే సెట్‌వేసి చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదల కానుంది. ఆయన ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో విభిన్న చిత్రం చేయనున్నాడు. ఫ్యామిలీ అండ్ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇందులో పవన్ యంగ్ లుక్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. సో.. 'కాటమరాయుడు' చిత్రం తర్వత ప్రస్తుతం మధ్యవయస్కుడిగా కనిపిస్తున్న పవన్ యంగ్ లుక్ కోసం బరువు తగ్గి, స్లిమ్‌గా తయారై, ఫ్రెష్‌గా కనిపించేందుకు కసరత్తులు చేయకతప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని, దానికోసం ఆయన తీవ్ర కసరత్తులు చేయాలని డిసైడ్ కావడంతో త్రివిక్రమ్ చిత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో చర్చ సాగుతోంది.