పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమా మొదలైనప్పటినుండి ఆ సినిమాపై ఏవో ఒక వార్తలు మీడియాలో ప్రముఖంగా వినబడుతూనే వున్నాయి. ఈ సినిమా తమిళ 'వీరం' కి రీమేక్ అని.... పవన్ డైరెక్టర్ మీద అలిగి షూటింగ్ నుండి వెళ్లిపోయాడని... శృతి హాసన్ 'కాటమరాయుడు' చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెడుతుందని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. మరోపక్క 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుందని... దీని బిజినెస్ చూసిన వారికీ కళ్ళుతిరగడం ఖాయమనే న్యూస్ అబ్బో ఒకటేమిటి ఎప్పుడూ 'కాటమరాయుడు' న్యూస్ మీడియాలో హైలెట్ అవుతూనే వుంది.
ఇక ప్రముఖంగా ఈ సినిమా తమిళ 'వీరం' రీమేక్ అనే వార్త మాత్రం ఇప్పటివరకు వినబడుతూనే వుంది. మరి 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుండి ఫస్ట్ లుక్ టీజర్ వరకు తమిళ్ 'వీరం' ని పోలి ఉండడంతో ఇక యాజిటీజ్ గా 'వీరం' ని తెలుగులో దింపేశారనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే అదంతా అబద్ధమంటోంది చిత్ర హీరోయిన్ శృతిహాసన్. 'కాటమరాయుడు' చిత్రం 'వీరం' కి రీమేక్ కాదని స్పష్టం చేస్తోంది. కేవలం ఆ కథని తీసుకున్నా కాటమరాయుడులో చాలా మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తున్నారని... అప్పట్లో బాలీవుడ్ 'దబాంగ్' ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసినా..... పూర్తిగా 'గబ్బర్ సింగ్' లో చాలామార్పులు చేర్పులు జరిగాయని.... అలాగే ఇప్పుడు 'కాటమరాయుడు' లో కూడా అదే జరుగుతుందని చెబుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివాడు... అయన నేను కలిసి నటించిన 'గబ్బర్ సింగ్' ఎంత పెద్ద హిట్టో ఇప్పుడు మా కాంబినేషన్ లో తెరకెక్కే 'కాటమరాయుడు' కూడా అంటే హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నామని చెబుతుంది. ఇక ఆ 'వీరం' రీమేక్ అనే వార్తలకు బ్రేక్ వెయ్యండి అని... రీమేక్ అయినా ఎవ్వరూ ఉన్నదిఉన్నట్లు దించెయ్యరు. ఖచ్చితంగా మార్పులు చేసి తీరుతారనే క్లారిటీ ఇచ్చేస్తుంది. మరి నిజంగా శృతి హాసన్ చెప్పినట్టు 'కాటమరాయుడు' సినిమా 'వీరం' కి రీమేక్ అయినా సినిమా మాత్రం అచ్చం అలాగే ఉండకపోతే బాగానే ఉంటుంది మరి.