బన్నీ నేడు వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. విభిన్న చిత్రాలను, పాత్రలను ఎంచుకుంటున్నాడు. 'జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు' వంటి విభిన్నమైన కథలతో తన స్టామినా పెంచుకుంటున్నాడు. తాజాగా ఆయన దిల్‌రాజు నిర్మాణంలో హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఐరన్‌లెగ్ పూజాహెగ్డేతో కలిసి 'డిజె' (దువ్వాడ జగన్నాథం)గా రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని బన్నీ గెటప్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఆయన కనిపిస్తున్నాడు. కాగా ఈ చిత్రం కథ ఇదేనంటూ రెండు మూడు కధలు సోషల్‌మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం తొలి టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని కథ ఏమిటి? ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? లేదా ఒకే క్యారెక్టర్ చేస్తున్నాడా? అనే దానిపై కాస్తైనా టీజర్‌తో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన ట్యూన్స్‌ను దేవిశ్రీప్రసాద్ అందించాడట. కాగా ఈచిత్రంలోని పాటలను కూడా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఒక్కటొక్కటిగా విడుదల చేస్తారని, సినిమా విడుదల కానున్న మే నెలలో ఓ వారం రోజుల ముందు ప్రీరిలీజ్ ఫంక్షన్ చేస్తారంటూ ప్రచారం మొదలైంది.