హాట్ యాంకర్ నుండి వెండితెరకు వచ్చి తన సత్తా చూపాలని అనసూయ భావిస్తోంది. సాధారణంగా పెళ్లై, పిల్లలు కూడా ఉన్న ఆడవాళ్లకు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ వంటి అవకాశాలు రావడం, వాటిని ప్రేక్షకులు ఆదరించడం టాలీవుడ్‌లో తక్కువ. కానీ అనసూయ ఆ ఘనతను సొంతం చేసుకుంటోంది. 'సోగ్గాడే చిన్ననాయనా'లో మెరిసి, 'క్షణం'లో వైవిద్యభరితమైన పాత్ర చేసి మెప్పించిన ఆమె ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ హీరోగా తాజాగా విడుదల కానున్న 'విన్నర్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పాటకు ఇప్పటికే మంచి క్రేజ్ లభిస్తోంది. ఈ పాట కూడా ఆమె పేరుతోనే 'సూయ.. సూయ.. అనసూయ' అంటూ సాగనుండటం విశేషమే మరి. అతి తక్కు వ చిత్రాలతోనే తన పేరుతో మొదలయ్యే లిరిక్‌ను ఆమె కోసం స్పెషల్‌గా రాశారంటే అది గొప్ప విషయమే. ఇక ఆమె ఇప్పటికే పవన్ 'అత్తారింటికి దారేది'చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయకపోవడానికి కారణం కూడా వెల్లడించింది. ఇక 'విన్నర్' పాట కోసం అనసూయకు ఏకంగా 25లక్షలు ఇచ్చారనే వార్త హల్‌చల్ చేస్తోంది. కానీ ఈ చిత్రంలో సాంగ్ చేసినందుకు ఆమెకు 14లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. అడ్వాన్స్‌గా 10లక్షలు ఇచ్చారు. ఇక ఈ పాట చిత్రీకరణ మూడు రోజులు ఆలస్యం కావడంతో అదనంగా మరో 6లక్షలు ఇస్తామని నిర్మాతలు అంగీకరించారని తెలుస్తోంది. అంటే ఆమెకు ఇంకా నిర్మాతలు 10లక్షలు ఇవ్వాల్సివుంది. కానీ నిర్మాతలు ఇప్పటివరకు ఆ 10లక్షలను ఇవ్వలేదనే సమాచారం. అయినా ఆమె ఈ చిత్రం ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. మరోపక్క ఈ చిత్రంలో తాను చేసిన పాటను ఐటం సాంగ్ అని పిలవవద్దని, తనపై ఐటం ముద్ర వేయవద్దని ఆమె రిక్వెస్ట్ చేస్తోంది. బాలీవుడ్‌లో హీరోలైన సల్మాన్, షార్‌ఖ్ వంటి వారు ఏదైనా చిత్రంలో ఓ పాటను చేస్తే దానిని ఐటం సాంగ్ అనకుండా స్పెషల్ సాంగ్ అని పిలుస్తున్నారని, కానీ ఆడవారు చేస్తే మాత్రం ఐటం సాంగ్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిజమే.. ఆమె వాదనలో కూడా నిజం ఉంది...!