Advertisementt

బాలయ్య 101 కి ఆయన్ని ఫిక్సయిపోవచ్చా..?

Thu 23rd Feb 2017 09:03 PM
balakrishna,ks ravikumar,101 movie,jayasimha,reddi  బాలయ్య 101 కి ఆయన్ని ఫిక్సయిపోవచ్చా..?
బాలయ్య 101 కి ఆయన్ని ఫిక్సయిపోవచ్చా..?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ తన 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' కథని  డైరెక్టర్ క్రిష్ తో ఎటువంటి సందేహాలు లేకుండా ఒకే చేసేసి దాన్ని తెరకెక్కించి హిట్ కొట్టేసాడు. ఇక ఇప్పుడు సమస్యల్లా ఆయన నటించే 101 వ చిత్రం గురించే వచ్చింది. సమస్య అంటూ ఏం లేదుగాని ఆ 101 చిత్ర దర్శకుడిగా రోజుకో పేరు తెరమీదకి రావడం తో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది అంతే. అసలు బాలయ్య డైరెక్టర్ కృష్ణవంశీ తో 'రైతు' చిత్రం చెయ్యాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనబడడం లేదు. ఇకపోతే  ఇప్పుడు బాలయ్య 101 వ చిత్ర దర్శకుడు దాదాపు సెట్ అయ్యాడనే అంటున్నారు. 

ఆయన ఎవరంటే కె.ఎస్.రవికుమార్. మరి బాలకృష్ణ కి కె.ఎస్.రవికుమార్ ఇప్పటికే ఒక ఫ్యాక్షన్ కథని వినిపించగా దానిని బాలయ్య దాదాపు ఒకే చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి 'జయసింహ' అనే టైటిల్ గాని లేకుంటే 'రెడ్డి గారు' అనే టైటిల్ గాని పెడతారని చెబుతున్నారు. ఈ మధ్యన 'సింహ' తో హిట్ ట్రాక్ ఎక్కిన బాలకృష్ణ కి 'జయసింహ' అనే టైటిల్ అయితే బావుంటుందని అంటున్నారు. మరో పక్క 'రెడ్డి' అనే టైటిల్ బాలయ్య కి బాగా సూట్ అవుతుందని... 'సమరసింహా రెడ్డి' వంటి రెడ్డి టైటిల్ తో వున్నఆ చిత్రం ఎంత పెద్ద హిట్టో అందుకో అలా రెడ్డి టైటిల్ అయినా బాగానే వుంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారట.

ఇక అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే ఏప్రిల్ లో ఈ చిత్రం సెట్స్ మీదకెళ్లే సూచనలున్నాయని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా నయనతార అయితే బావుంటుందని అనుకుంటున్నారట. ఇక హీరోయిన్ గా నయనతార ని బాలకృష్ణ కూడా ఒకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ప్రొడ్యూసర్ కూడా సెట్ అయ్యాడనే ప్రచారం జరుగుతుంది. బాలయ్య - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ అని చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ