Advertisementt

కోర్టు కూడా వారిని విడదీసింది..!

Thu 23rd Feb 2017 06:11 PM
amala paul,vijay,court,divorce  కోర్టు కూడా వారిని విడదీసింది..!
కోర్టు కూడా వారిని విడదీసింది..!
Advertisement
Ads by CJ

ఏరికోరి ప్రేమించి పెళ్లాడిన అమలాపాల్ - విజయ్ లు రెండేళ్లు తిరక్కుండానే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కారు. ఇక అసలు తప్పు ఎవరివైపు ఉందొ స్పష్టం గా ఎవరికీ తెలియదుగాని వీరిరువురు తమకు విడాకులు కావాలనే పట్టుదల మీద ఉండి ఎట్టకేలకు వాటిని సాధించుకున్నారు. అమల భర్త విజయ్ ఇప్పటివరకు ఈ విడాకుల విషయమై ఎక్కడా స్పందించలేదు గాని... అమల మాత్రం తాను పెళ్లి అనే పెద్ద సమస్య నుండి బయట పడ్డానని చెప్పుకుంటుంది. తనకు తన కెరీర్ ముఖ్యమని... పెళ్లి ముఖ్యం కాదని తేల్చేసింది. ఇక విడాకుల వ్యవహారం తెరమీద కొచ్చాక అమల పాల్ కి అదృష్టం ఒకేసారి తలుపుతట్టి కెరీర్ లో బిజీ అయిపొయింది. అవకాశాల మీద అవకాశాలు అందుకుంటూ తమిళ్ లో చక్రం తిప్పడానికి రెడీ అయ్యింది.

ఇకపోతే ఇప్పటివరకు కోర్టు కేసులతో కొంచెం ఇబ్బంది పడ్డ అమల ఇప్పుడు ఆ విడాకుల మంజూరుతో ఫ్రీ బర్డ్ అయిపోయింది. తాను మనసారా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ తో తనకున్న సంబంధాలకు కోర్టు విడాకులు మంజూరు చేసి పూర్తిగా విడగొట్టేసింది. ఇక అమల తన కెరీర్ మీద పూర్తి దృష్టి సారించి జీవితం లో అనుకున్నది సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక అమల భర్త విజయ్ కూడా తన దృష్టాంతా ఇప్పుడు తన దర్శకత్వం మీదే సారించాడట. తాను ఇవన్నీ మర్చిపోయి తన కెరీర్ ని మలుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ