Advertisementt

పవన్‌ ఒక్కడిదే తప్పుకాదు....!

Wed 22nd Feb 2017 08:43 PM
pawan kalyan,chiranjeevi,rajinikanth,balakrishna  పవన్‌ ఒక్కడిదే తప్పుకాదు....!
పవన్‌ ఒక్కడిదే తప్పుకాదు....!
Advertisement

తాజాగా 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' విషయంలో ఓ డిస్ట్రిబ్యూటర్‌ తనకు జరిగిన అన్యాయంగా స్పందించాడు. ఇందులో వాస్తవం కూడా ఉంది. కాకపోతే కొందరు పవన్‌ యాంటీ ఫ్యాన్స్‌ మాత్రం దీనిని పవన్‌ను విమర్శించేందుకు ఓ అస్త్రంగా వాడుతున్నారు. కానీ ఈ విషయంలో పవన్‌ ఒక్కడినే తప్పు పట్టలేం. గతంలో కూడా ఇలా జరిగిన అనేక విషయాలు వెలుగు చూడలేదు. ఇలాంటి పరిస్థితులను రజనీకాంత్‌ నుండి చిరంజీవి వరకు, బాలకృష్ణ నుంచి మహేష్‌బాబు వరకు ఎందరో చేశారు. దీనిలో ఎక్కువగా నిర్మాతల తప్పు ఉంటుందే గానీ హీరోల పాత్ర కేవలం నామమాత్రమే అనేది తెలుసుకోవాలి. తప్పంతా నిర్మాతది, డిస్ట్రిబ్యూటర్లదే. కానీ ఇది తెలియని బయటి ప్రేక్షకులు ఇది ఒక్కరు చేసిన తప్పుగానే భావిస్తుండటం బాధాకరం. 

గతంలో రజనీకాంత్‌ వంటి మంచి మనసున్న వ్యక్తి మీదనే ఇలాంటి ఆరోపణలు వచ్చి, చివరకు ధర్నా వరకు దారి తీశాయి. దాంతో రజనీ చాలా కలత చెందాడు. ఇక చిరంజీవితో 'బాగ్దాద్‌ గజదొంగ' చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో సురేష్‌కృష్ణతో పాటు మరో హాలీవుడ్‌ దర్శకునితో చేయాలనుకున్నారు. బాలకృష్ణ కూడా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఎస్‌.గోపాల్‌రెడ్డితో ఓ చిత్రం ప్రారంభించారు. వీటి అనౌన్స్‌మెంట్‌ రోజునే డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చి, సినిమా పట్టాలెక్కడానికి ముందే ఆయా నిర్మాతలకు టేబుల్‌ ఫ్రాఫిట్స్‌ వచ్చాయి. కానీ వారు ఆ చిత్రాలను ఆపేశారు. తమ తమ చిత్రాలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు వాటి బదులుగా మరో తక్కువ బడ్జెట్‌తో చిత్రాలను చుట్టేసి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 

ఇక మహేష్‌బాబు పివిపి బేనర్‌లో చేసిన 'బ్రహ్మూెత్సవం' చిత్రం డిజాస్టర్‌ అయింది. దానికి బదులుగా పివిపి బేనర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ తన వల్ల నష్టపోయిన వారికి పరిహారంగా మరో చిత్రం చేయాలని భావించాడు. కానీ ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. ఆ స్థానంలో నిర్మాతలుగా దిల్‌రాజు, అశ్వనీదత్‌లు తెరపైకి వచ్చారు. అసలు మహేష్‌ పివిపికి మరో సినిమా చేస్తానని చెప్పి కూడా హ్యాండ్‌ ఎందుకిచ్చాడో? ఇండస్ట్రీ వారికి తప్ప మిగిలిన ఫ్యాన్స్‌కు కూడా తెలియదు. ఇలాంటి వాటిని బహిర్గతం చేయడం కూడా మంచిదికాదు.. విజ్ఞత అనిపించుకోదు. ఇక 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్రానికి పవన్‌ కూడా ఓ నిర్మాతే కావడం, 'బ్రహ్మూెత్సవం' చిత్రానికి కూడా మహేష్‌ ఓ భాగస్వామి కావడం ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ చిత్రాల నష్టం విషయంలో వారిపై విమర్శలు వస్తున్నాయి. దీనిని ఆయా హీరోలు గమనించాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement