Advertisementt

నాగ్ డిప్రెషన్ లో వున్నాడా..?

Wed 22nd Feb 2017 03:58 PM
akkineni nagarjuna,om namo venkatesaya movie,akhil,shriya bhupal,marriage cancelled  నాగ్ డిప్రెషన్ లో వున్నాడా..?
నాగ్ డిప్రెషన్ లో వున్నాడా..?
Advertisement
Ads by CJ

నాగార్జున- కె. రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఓం నమో వెంకటేశాయ' సినిమా విడుదలై క్రిటిక్స్ నుండి మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాకి ప్రతివక్కరు మంచి రేటింగ్ తో పాసిటివ్ మార్కులు వేసేసారు. అయితే సినిమా పెద్దగా ఎవరికీ ఎక్కలేదనే టాక్ విబడుతుంది. అందువలనే సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ పెద్దగా లేవని అంటున్నారు. అంటే భక్తి రస చిత్రాలను పెద్దగా ఎవరు లైక్ చెయ్యడం లేదా? అనే ఆలోచన ప్రతివక్కరిలో కనబడుతుంది. అలాగే ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ చెయ్యకపోవడం వలెనే ఈ సినిమా అంతగా ఆడలేదని టాక్ కూడా వినబడుతుంది. ఏదిఏమైనా  వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జున మాత్రం ఈ సినిమా నిరాశపరచడంతో కొంత డిప్రెషన్ లోకి వెళ్లినట్లు వార్తలైతే ప్రచారం జరుగుతున్నాయి.

గత నాలుగైదు రోజులుగా నాగార్జున ఎవ్వరితో కలవకుండా కాంటాక్ట్ లోకి కూడా రాకుండా ఒంటరిగా గడుపుతున్నాడని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు కొత్తగా అఖిల్ మ్యారేజ్ రద్దయిందనే రూమర్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే అఖిల్ పెళ్లి రద్దయిన కారణంగానే నాగ్ ఇలా అప్ సెట్ అయ్యాడనే వార్తలు వినబడుతున్నాయి. అఖిల్ - శ్రీయ భూపాల్ రెడ్డి పెళ్లి రద్దయ్యిందంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుండి ఒకటే ప్రచారం జరుగుతుంది. అఖిల్ కి శ్రీయ భూపాల్ కి మధ్యన విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ పెళ్లి రద్దు చేసుకున్నారనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక అఖిల్ పెళ్లి రద్దు కావడం వలనే నాగార్జున అప్ సెట్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లాడనే ప్రచారం మొదలైంది. 

ఇప్పటికే  అఖిల్ కి సినిమాల్లో ఆదిలోనే దెబ్బకొట్టడం తో రెండో ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికే భయపడిన నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి విషయంలోనూ అలా జరగడంతో బెంగపడిపోయాడనే టాక్ మొదలయ్యింది. ఇక ఈ పెళ్లి రద్దు విషయమై అటు జివికె ఫ్యామిలీ గాని, ఇటు అక్కినేని ఫ్యామిలీ గాని ఇంతవరకు స్పందించలేదు. ఇక నాగార్జున ఎవరికీ కాంటాక్ట్ లోకి రాకుండా అజ్ఞాతంలో గడపడంపై ఇప్పుడు అఖిల్ పెళ్లి రద్దైయిందనే వార్తలకు ఊతమిచ్చినట్టు ఉందని అంటున్నారు నాగ్ సన్నిహితులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ