రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఒకప్పుడు సమంత, కాజల్ లు ఎలా వరుస ఆఫర్స్ తో దూసుకుపోయారో అలా ఇప్పుడు ఆమె కూడా హీరోయిన్ గా మంచి ఆఫర్స్ పట్టేసి దూసుకుపోతుంది. తెలుగులో స్టార్ హీరోల చిత్రాలతోనే కాకుండా చిన్న హీరోల సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా గడుపుతుంది. ఆమె సాయి ధరమ్ తేజ్ పక్కన నటించిన 'విన్నర్' చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. మరో పక్క సూపర్ స్టార్ మహేష్ పక్కన నటిస్తుంది. అయితే రకుల్ ఇప్పటివరకు నటించిన సినిమాలు ఏమి ఆమెని టాప్ లో కూర్చోబెట్టే సినిమాలు కావు. అన్ని యావరేజ్ హిట్స్ మాత్రమే. కెరీర్ లో చెప్పుకోలేని సూపర్ హిట్ లేకపోయినా కూడా ఆమె వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.
ఇక టాలీవుడ్ లో ఒక పక్క దున్నేస్తూనే ఇప్పుడు తమిళ్ లో కూడా తన హావ కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే తమిళ హీరో కార్తీ పక్కన నటిస్తున్న రకుల్ తర్వాత కార్తీ అన్న సూర్య పక్కన కూడా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. సూర్య, సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి వుంది. ఇక ఈ సినిమాలో సూర్య కి జోడిగా రకుల్ ప్రీత్ అయితే బావుంటుందని ఆమెని సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ ని ఒకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే సూర్య ప్రస్తుతం విజ్ఞేశ్ శివన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే సెల్వ రాఘవన్ సినిమాకి షిఫ్ట్ అవుతాడని సమాచారం. మరి రకుల్, సూర్య పక్కన కూడా నటించి ఇటు తెలుగులో వరుస ఆఫర్స్ తో దూసుకు పోయినట్లే అటు తమిళంలో కూడా దూసుకుపోతోందని అంటున్నారు.