అక్కినేని వారసులు ఇద్దరూ తొందరలోనే పెళ్లికొడుకులు కాబోతున్నారు. వీరు తాము ప్రేమించిన అమ్మాయిలతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లిళ్లకు రెడీ అయ్యారు. అక్కినేని నాగ చైతన్య, సమంతతో పెళ్ళికి సిద్ధపడగా... అఖిల్, జివికె మనవరాలు శ్రీయభూపాల్ తో పెళ్ళికి రెడీ అయ్యాడు. ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ గత ఏడాది డిసెంబర్ 9న కొంతమంది అతిధులు, కుటుంబ సభ్యులమధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ ఎంగేజ్మెంట్ కి నాగార్జున బయటి వాళ్ళని ఎవరిని ఆహ్వానించలేదు. అయితే అఖిల్ పెళ్లి కూడా ఎక్కడో ఇటలీలోని రోమ్ లో చెయ్యడానికి నాగార్జున ఫ్యామిలీతో పాటె శ్రీయ భూపాల్ ఫ్యామిలీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఇకపోతే నాగ చైతన్య నిచ్చితార్ధం కూడా సమంతతో చాలా సింపుల్ గా చేసేసాడు నాగార్జున. అయితే నాగ చైతన్య - సమంతల పెళ్లి మాత్రం ఇప్పట్లో లేనట్టే అని అంటున్నారు. ఇక అఖిల్ మాత్రం పెళ్ళికి తొందర పడుతున్నాడో... ఏమో నాగార్జున ముందుగా అఖిల్ పెళ్లి ఏర్పాట్లు చేస్తూ బిజీ అయిపోయాడు. ఇక శ్రీయ భూపాల్ కుటుంబమైతే ఏకంగా వినాయకుడి పూజతోపాటే పసుపుకొట్టే కార్యక్రమాన్ని కూడా ఆఫిసియల్ గా మొదలు పెట్టేసారు.
ఇవన్ని ఇలా జరుగుతుండగా నిన్నటి నుండి అఖిల్ - శ్రీయ భూపాల్ పెళ్లి రద్దయిందంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది. అఖిల్ పెళ్లి రద్దయిందంటూ పెద్ద ఎత్తున రూమర్లు రేగాయి. మరి ఇది రూమరో ఏమో తెలియదు గాని ఈ పెళ్లి రెండుకుటుంబాలు వారు క్యాన్సిల్ చెయ్యాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే సమస్య మాత్రం రెండు కుటుంబ సభ్యుల వైపు నుండి కాకుండా అఖిల్ కి శ్రీయ భూపాల్ కి మధ్యన వచ్చినట్టు చేబుతున్నారు. వీరిద్దరి మధ్యన విభేదాల కారణంగానే ఈ పెళ్లిని రద్దు చేస్తున్నట్టు చెబుతున్నారు. పెళ్లి చేసుకుని సఫర్ అయ్యేకంటే ముందే విడిపోయి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటే మంచిదనే నిర్ణయానికి అఖిల్, శ్రీయ వచ్చినట్టు చెబుతున్నారు. ఇక ఇటలీలోని రోమ్ లో జరిగే ఈ పెళ్ళికి హాజరయ్యే 700 మంది తమ టికెట్స్ ని కూడా బుక్ చేసుకున్నారట. అయితే గెస్టులను వారి టికెట్లు క్యాన్సిల్ చేయించుకోవలసిందిగా ఇరు కుటుంబాలు కోరినట్టు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి రద్దు విషయం మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.