రాజకీయాలలో భాగంగా ఏపీలో సమస్యలపై పోరాడుతూ పవన్ కళ్యాణ్ నిజమైన హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. అక్కడ ఏ సమస్య వచ్చిన నేనున్నాను అంటూ అక్కడ వాలిపోయి సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై దండెత్తుతున్నాడు. అక్కడ సమస్యలు ఉన్నవాళ్లు వున్నపళం గా పవన్ ని కలిసి మద్దతు కోరి మరీ సమస్యల పరిష్కారానికి వారు పవన్ ని మాత్రమే నమ్ముకుంటున్నారు. మరి వారికోసం అంతలా పోరాడుతూ హీరో గా పేరు తెచ్చుకున్న పవన్ ఇక్కడ సినిమాల్లో బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం దొరకడం లేదు. అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్' చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'జానీ' తర్వాత అంతటి ప్లాప్ అయిన చిత్రం
ఇక ఆ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ చాలా నష్టపోయారు,. అయితే ఆ సినిమా నిర్మాత శరత్ మరార్ మాత్రం సర్దార్ బయ్యర్స్ ని అడ్డుకోవడానికే పవన్ 'కాటమరాయుడు' చిత్రాన్ని పవన్ తో చేస్తున్నాని చెప్పాడు. ఇక పవన్ దగ్గర నుండి కూడా అదే సమాధానం వచ్చింది. అయితే ఇప్పుడు 'కాటమరాయుడు' నిర్మాత శరత్ మరార్ మాత్రం కాటమరాయుడు చిత్రాన్ని వేరే డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మడంతో 'సర్దార్' డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిమరీ పవన్ మాకు సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు శరత్ మరార్ పవన్ కి తెలియకుండా 'కాటమరాయుడు' ని వేరే డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మారని.... ఈ విషయం పవన్ కళ్యాణ్ కి కూడా తెలియకుండా శరత్ మరార్ అండ్ గ్రూప్ నాటకాలాడుతోందని ఆరోపిస్తున్నారు.
అసలు నిజంగా పవన్ కి ఆ విషయాలు తెలియవా? తెలిసినా ఏమి చెయ్యలేక అలా సైలెంట్ గా వున్నాడా? అయినా మీడియాలో ఇంతగా 'సర్దార్' బయ్యర్స్ గొడవ చేస్తుంటే ఇప్పటివరకు పవన్ కి విషయం తెలియదా? మరి రాజకీయాల్లో ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పిన మాటలు అన్ని అబద్ధమేనా? ఇక్కడ సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి న్యాయం చెయ్యలేక కామ్ గా వున్న పవన్ అక్కడ మాత్రం హీరోగా వెలిగిపోతున్నాడని అందరూ బహిరంగం గానే అంటున్నారు. చూద్దాం ఈ గొడవ జరిగి అప్పుడే ఒకరోజు కావొస్తుంది. పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి సమాధానం వస్తుందో..... మరి.