Advertisementt

సండే: చైతు, సమంత ఓ కుక్కపిల్ల..!

Tue 21st Feb 2017 11:27 AM
samantha,naga chaitanya,weekend,puppy  సండే: చైతు, సమంత ఓ కుక్కపిల్ల..!
సండే: చైతు, సమంత ఓ కుక్కపిల్ల..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున - అమల ప్రేమికులుగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో... మళ్ళీ ఇప్పుడు నాగ చైతన్య - సమంత లు ప్రేమ పక్షుల్లా విహరిస్తూ గత ఏడాది నుండి అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక వీరు కొన్ని రోజులనుండి గుట్టు చప్పుడు కాకుండా నడిపిన ప్రేమాయణాన్ని మీడియా బహిర్గతం చేసేసింది. దానితో నాగార్జున కూడా లైన్లోకొచ్చి ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసేశాడు. ఇక మోస్ట్ పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్న ఈ జంట ఆఫీసియల్ గా ఒక్కటయ్యే టైమ్ దాదాపు దగ్గరికి వచ్చేసింది. అయితే సమంత, చైతన్య లు ఇద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హాలిడే ట్రిప్స్ మాత్రమే కాదు వీకెండ్లో కూడా వీరిద్దరూ పిచ్చ పిచ్చ గా ఎంజాయ్ చేస్తూ వారు ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నారు.

ఇక ఈ వీకెండ్ ను కూడా సమంత - నాగ చైతన్య ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో సమంత ఒక పిక్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌ లో అప్ లోడ్ చేసింది. ఇక ఆ పిక్ లో సమంత చేతిలో ఒక కుక్కపిల్లతో దానిని ముద్దు చేస్తూ కూర్చోగా... అలా సమంత ఎంజాయ్ చేయడాన్ని నాగ చైతన్య వెనుకగా కుర్చీలో కూర్చుని చూస్తూ మురిసిపోతున్నాడు. ఇక సమంత తమ ఫొటోతో పాటే 'ఆదివారాలు అంతా పక్కా ప్లానింగ్ తో ఉండాలి' అంటూ టాగ్ కూడా చేసింది. సో తనకు కాబోయే భర్తతో వీకెండ్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తుందో... కూడా అందరికి చెప్పేస్తుంది సమంత.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ