Advertisementt

నిన్న పవన్‌ గురించి.. నేడు కొడుకు గురించి..!

Mon 20th Feb 2017 08:29 PM
pawan kalyan,hero madhavan,madhavan son,swimming race  నిన్న పవన్‌ గురించి.. నేడు కొడుకు గురించి..!
నిన్న పవన్‌ గురించి.. నేడు కొడుకు గురించి..!
Advertisement
Ads by CJ

విలక్షణ నటుల్లో కమల్‌, విక్రమ్‌, మమ్ముట్టి, అమీర్‌ఖాన్‌ వంటి వారి తర్వాత చెప్పుకోదగిన నటుడు మాధవన్‌. చాక్లెట్‌బోయ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన తన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోకుండా.. తనకు వచ్చిన అరుదైన చిత్రాలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన 'సాలా ఖద్దూస్‌' చిత్రం బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం వెంకటేష్‌ హీరోగా 'గురు' పేరుతో రూపొంది వేసవిలో విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఆయన విక్రమ 'వేద', బాలీవుడ్‌లో 'చందమామ దూర్‌కే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈయన కుమారుడు వేదాంత్‌ ఇటీవల ఓ రికార్డ్‌ సృష్టించాడు. 4కిలోమీటర్ల దూరాన్ని కేవలం 57 నిమిషాలలో ఈదాడు. దాంతో మాధవన్‌ సంతోషంతో ఉప్పొంగుతున్నాడు. తన కుమారుడిలో ఇంత ప్రతిభ ఉందని ఊహించలేకపోయానని, ఈరోజు నిజంగానే తండ్రిగా గర్వపడుతున్నానని చెప్పి తన కుమారుడితో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశాడు. ఇటీవల ఆయన పవన్‌తో కలిసి అమెరికాలో పర్యటించాడు. హార్వర్డ్‌ యూనివర్శిటీలో జరిగిన ఇండియన్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన పవన్‌తో పాటు ప్రసంగించాడు. భారతీయ నటుల్లో ఈ అరుదైన అవకాశం పవన్‌, మాధవన్‌లకు మాత్రమే దక్కింది. ఆ సదస్సులో పాల్గొనడం ఎంతో మధురానుభూతి అని, అక్కడి వారు తనకిచ్చిన గౌరవం, ఆతిథ్యం మరవలేనిదని, అలాగే అందులో తాను మెచ్యూర్డ్‌ స్పీచ్‌ని ఇచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నానని తెలిపి, పవన్‌తో కలిసి పాల్గొనడం పట్ల కూడా ఆనందం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ