ప్రస్తుతం స్లైలిష్‌స్టార్‌గా సొంత ఇమేజ్ తెచ్చుకోవడానికి అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్‌లు పెద్ద స్కెచే వేస్తున్నారనే విమర్శ ఉంది. ఇక 'చెప్పను... బ్రదర్' వ్యాఖ్యలతో మెగాభిమానులు కూడా పవన్, బన్నీ గ్రూప్‌లుగా విడిపోయారు. చిరు వేసిన దారిని నమ్ముకొని పైకొచ్చి, ఆతర్వాత తన అహంకారం చూపించాడని, బన్నీ ఒక కన్నింగ్ అని పవన్ అభిమానులు భావిస్తుంటే, రామ్‌చరణ్ కన్నా అన్ని విషయాలలో మా బన్నీనే గొప్ప అని కొందరు వాదిస్తున్నారు.
మొత్తానికి ఇప్పుడు పవన్, బన్నీలను ఉమ్మడిగా సపోర్ట్ చేసే వారి సంఖ్య తగ్గిందనేది మాత్రం వాస్తవం. బన్నీ తన కెరీర్‌లో మొదటి నుంచి డ్యాన్స్‌లలో చిరుని, నటనలో పవన్‌ని అనుకరించేవాడనే విమర్శ కూడా బహిరంగంగానే వ్యక్తమవుతోంది. ఇక ఇప్పుడు ఓ విషయంలో బన్నీపై మరలా విమర్శలు మొదలయ్యాయి. పవన్ సినిమా కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు మంచి బ్రేక్‌నిచ్చిన చిత్రం 'గబ్బర్‌సింగ్'. ఈ చిత్రంతో పవన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రంలో పవన్ వాడే బైక్‌నెంబర్ 'ఏపీ 27 జీయస్ 2425' కాగా 'డిజె' ఫస్ట్‌లుక్‌లో బన్నీ నడుపుతున్న బజాజ్ స్కూటర్ నెంబర్ కూడా ఏపీ ఈఏ 2425. ఇలా ఈ ఇద్దరి నెంబర్లు 2425గా ఉండటం ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
బన్నీ 'గబ్బర్‌సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టడానికే పవన్ బైక్ నెంబర్‌ను సెంటిమెంట్‌గా వాడుకున్నాడనే ప్రచారం మొదలైంది. ఇక ఈ రెండు చిత్రాలకు దర్శకుడు హరీష్‌శంకరే కావడం గమనార్హం. కాబట్టి హరీష్‌శంకర్‌కే ఈ నెంబర్ సెంటిమెంట్ అయి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా సినిమా ఫీల్డ్‌లోని వారు ప్రతి చిన్న విషయానికి సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం పవన్, బన్నీల బైక్ నెంబర్ విషయం వినడానికి చిన్న విషయంగానే కనిపించినా, దీని వెనుక ఏదో సెంటిమెంట్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.