Advertisementt

మహేష్ బాబు చిత్రం టైటిల్ ఇదే..!

Mon 20th Feb 2017 05:41 PM
mahesh babu,muragaadas director,pvp,winner pre release function,mahesh cinema title  మహేష్ బాబు చిత్రం టైటిల్ ఇదే..!
మహేష్ బాబు చిత్రం టైటిల్ ఇదే..!
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా మహేష్ ఫ్యాన్స్ నుండి సామాన్య ప్రేక్షకుడు వరకు మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో రాబోయే కొత్త చిత్ర టైటిల్ ఏమిటో... టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్యన మహేష్ బాబు టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేస్తారు.... ఆ టీజర్ ని ప్రత్యేకంగా కట్ చేపిస్తున్నారని... దానికి చాల ఖర్చు అవుతుందనే ప్రచారం జరిగింది. ఇకపోతే మహేష్ బాబు తాజా చిత్ర టైటిల్ ఇదే అంటూ 'సంభవామి' అనే టైటిల్ని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.

అయితే ఇప్పుడు మహేష్ బాబు కొత్త చిత్రం టైటిల్ ఇదే అంటూ 'సంభవామి' టైటిల్ గురించి నిర్మాత పివిపి చెప్పకనే చెప్పేసాడు.నిన్న ఆదివారం జరిగిన 'విన్నర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పివిపి, నిర్మాత ఠాగూర్ మధు గురించి  మాట్లాడుతూ... ఠాగూర్ మధు ఈ సంవత్సరం 'మిస్టర్, విన్నర్, సంభవామి యుగే యుగే' అనే మూడు సినిమాలు చేస్తున్నాడు... ఆ మూడు చిత్రాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాని అన్నాడు. అంటే ఠాగూరు మధు మహేష్ చిత్ర నిర్మాతల్లో ఒకడు కావడంతో..... పివిపి చెప్పిన 'సంభవామి యుగే యుగే' టైటిల్ మహేష్ కొత్త చిత్ర టైటిల్ అని అందరూ దాదాపు ఫిక్స్ అయిపోయారు.

ఇప్పటికే ఆ టైటిల్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరగడంతో ఇక మహేష్ టైటిల్ ఇదే అని అందరూ 'సంభవామి'  టైటిల్ గురించి మళ్లీ మీడియాలో ప్రచారం మొదలెట్టేసాడు. ఇక మిగిలిందల్లా మహేష్ కొత్త చిత్ర టీజర్ ని మాత్రమే విడుదల చెయ్యాలన్న మాట మురుగదాస్. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్ జోడి కడుతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ