Advertisementt

ఫ్యాన్స్‌ ఆదరిస్తారా...?

Mon 20th Feb 2017 12:46 PM
tollywood stars,bollywood stars,top heroine namratha,aishwarya bachhan,mahesh babu wife namratha  ఫ్యాన్స్‌ ఆదరిస్తారా...?
ఫ్యాన్స్‌ ఆదరిస్తారా...?
Advertisement
Ads by CJ

నిన్నటితరం హీరోయిన్లు అయిన శ్రీదేవి, జయప్రద, రేఖ వంటి వారు ఇప్పటికీ అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూనే ఉన్నారు. ఇక బాలీవుడ్‌లో పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా మరలా రీఎంట్రీ ఇచ్చి అభిమానులను, ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న వారిలో ఐశ్వర్యాబచ్చన్‌ నుండి కాజోల్‌ వరకు మరెందరో ఉన్నారు. కోలీవుడ్‌లో కూడా ఖుష్భూ, జ్యోతిక వంటి వారు అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో ఎప్పుడో స్టార్‌ని పెళ్లి చేసుకొని తెరపై కనిపించకుండా తల్లిగా, భార్యగా ఎన్నో బాథ్యతలను నిర్వర్తిస్తూన్న నటి మరలా గ్లామర్‌ పాత్రలో కనిపిస్తే ఫ్యాన్స్‌ ఒప్పుకుంటారా? అంగీకరిస్తారా? అనేది పెద్ద ప్రశ్నార్దకమే. అలా సక్సెస్‌ అయిన వారు కూడా తెలుగులో పెద్దగా కనిపించరు. 

ఏదో తల్లి, వదిన, అక్క వంటి క్యారెక్టర్స్‌కు మాత్రమే పరిమితమవుతారనే ప్రచారం ఉంది. కాగా ఒకప్పటి బాలీవుడ్‌, టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా రాణించి, తన యుక్తవయసులోనే మిస్‌ ఇండియాగా ఎంపికైన కోటీశ్వరురాలు నమ్రత. ఆమె సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును పెళ్లాడిన తర్వాత కేవలం ఇంటికి, బిజినెస్‌లకు, పిల్లలకు మాత్రమే పరిమితమైంది. తన భర్త చేసే సినిమాల కథలు, ప్రమోషన్‌ వంటి కార్యకలాపాలను తెరవెనుక నుండి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇటీవల ఆమె తిరుమలకు వెళ్లి స్వామివారికి తలనీలాలు ఇచ్చి, మొక్కు తీర్చుకుని డేర్‌గా గుండుతోనే కనిపించింది. 

ఇక ఇప్పుడు తనకు జుట్టు పెరిగే కొద్ది వివిధ రకాల హైర్‌స్టైల్స్‌ను ఫాలో అవుతోంది. ఇటీవల ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు హాజరైన ఆమె త్వరలో ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో నటించనున్నానని తెలిపింది. అయితే అది ఏ భాషల్లో, హీరోలు ఎవరు? అనే విషయాలను మాత్రం రహస్యంగా ఉంచి ఇప్పటికీ బయటపెట్టలేదు. ఆమె నటించబోయే చిత్రంలో ఆమె అల్ట్రామోడ్రన్‌ లుక్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈమధ్య ఆమె చాలా అల్ట్రామోడ్రన్‌గా, ఆకట్టుకునే ఫిజిక్‌తో, మంచి మోడ్రన్‌ డ్రెస్‌లు వేసుకుంటూ కనిపిస్తోంది. ఆమెను మరలా వెండితెరపై చూడటం ఆనందకరమే అయినా ఘట్టమనేని ఫ్యాన్స్‌ వారు ఎంతవరకు ఆమెను ఆదరిస్తారు? అనేది ప్రశ్నార్దకమే. మొత్తానికి ఆమె టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా తెరతీస్తుందేమో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ