అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే' ని హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ డీజే చిత్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా కనబడతాడని డీజే ఫస్ట్ లుక్ లో చూపించేసారు . అయితే ఇప్పుడు అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా చేస్తున్న ఈ డీజే చిత్రం పై వివాదం రాజుకుంది. అది ఎలా అంటే డీజే లో అల్లు అర్జున్ కనబడే బ్రాహ్మణ పాత్ర కోసం కర్ణాటక హాసన జిల్లా బేలూరు చెన్నకేశవ ఆలయంలో శివాలయం, శివలింగం సెట్లను వేశారు. అయితే ఈ సెట్స్ వేయడంపై అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చెన్నకేశవ - వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్ ఎలా వేస్తారని వారు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అదే ఆగ్రహంతో వారు షూటింగ్ జరగకుండా అడ్డుకున్నారు. మీరు ఇక్కడ ఆలయంలో సెట్స్ వేయడమే కాకుండా షూటింగ్ పేరిట భక్తులను ఆలయంలోకి ప్రవేశించకుండా ఎలా అడ్డుకుంటారని...వారు తన ఆగ్రవేశాలను తెలిపారని సమాచారం. అయితే డీజే చిత్ర యూనిట్ మాత్రం తాము దేవాదాయ శాఖ నుండి అనుమతులు తెచ్చుకున్నామని ఈ షూటింగ్ కోసం రోజుకి వారికీ 1.5 లక్షలు చెల్లిస్తున్నామని... ఆందోళన చేపడుతున్న స్థానికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే స్థానికులతో పాటే ఆలయ ప్రధానార్చకులు కూడా గత వారం రోజుల నుండి దేవుడికి సరిగ్గా పూజలు నిర్వహించలేకపోతున్నామని తన ఆవేదనని తెలిపారట. ఇక చేసేదిలేక డీజే చిత్ర యూనిట్ తమ షూటింగ్ ని కొంతసేపు నిలివేశారని సమాచారం.