బాలయ్య మంచి జోరు మీదున్నాడు. బాలకృష్ణ తన 100 వ చిత్రమైన 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో చారిత్రాత్మక హిట్ కొట్టి తన 101 వ సినిమాని మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఈ ఏడాదే ఉంటుందని ప్రకటించాడు. మోక్షజ్ఞ కి మంచి కథ, దర్శకుడు వంటి వాటిని సెట్ చెయ్యాలి. మరో వైపు 101 సినిమా గురించిన ప్లాన్. అంతేకాకుండా ఆయన ఒక ఎమ్యెల్యే కూడా. అంటే అటు ప్రజల గురించి కూడా ఆలోచించాలి. ఇన్ని బాధ్యతల మధ్యన బాలయ్య క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతూనే తన తండ్రి బయోపిక్ తీస్తానని అధికారిక ప్రకటన కూడా చేసాడు. అవన్నీ ఎలాగున్నా తన 101 సినిమాని ఎవరితో చెయ్యాలనే మీమాంస ఇంకా వీడలేదు బాలయ్యని. ఇప్పటికే కృష్ణవంశీ తో 'రైతు' సినిమా అనుకున్నప్పటికీ.. అది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు కొత్తగా 101 సినిమా డైరెక్టర్స్ గా పూరి, వినాయక్ ల పేర్లు వినబడుతున్నాయి. మరి పూరి పేరు ఎలాగున్నా కూడా దర్శకుడిగా బాలయ్య 101 చిత్రానికి వినాయక్ సెట్ అయ్యేటట్టు ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య తో వినాయక్ చర్చలు జరుపుతున్నట్టు... స్టోరీ కూడా వినిపించినట్లు వార్తలొస్తున్నాయి. మరి బాలయ్య గనక వినాయక్ కథని ఒకే చేస్తే ఆ సినిమాకి పేరు కూడా రెడ్డి అనే పేరు వచ్చేలా టైటిల్ పెట్టాలనే ఆలోచనలో వినాయక్ ఉన్నట్లు సమాచారం. అసలు బాలయ్య - వినాయక్ కాంబినేషన్ ఇప్పటికే 'చెన్నకేశవరెడ్డి' సినిమా వచ్చింది. మళ్ళీ వినాయక్ తో ఒక పవర్ ఫుల్ ఫ్యాక్షన్ డ్రాప్ స్టోరీ చేసి హిట్ కొట్టాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ సినిమాకి రెడ్డి అనే పేరు వచ్చేలా టైటిల్ కావాలనుకుంటున్నాడట బాలయ్య.