సమైఖ్యాంధ్ర కోసం వీరలెవల్లో కష్టపడిన వ్యక్తి మాజీ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్. ఈయన పేరు వినగానే సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన రోజులు చాలామందికి గుర్తుకు వస్తాయి. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మరీ సన్యసించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్. కానీ ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలను చూసినట్లయితే లగడపాటి ఏపీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చి కీలకంగా ఎదగనున్నాడనే విషయం అవగతం అవుతుంది.
ప్రముఖంగా రాజకీయాలపై లగడపాటి చేయిస్తున్న సర్వేలకు మంచి ప్రచారం వచ్చిన విషయం తెలిసిందే. దాంతో లగడపాడి సర్వే అంటే బాగా పేరు కూడా వచ్చేసింది. ఆ సర్వేలతో లగడపాటి రాజకీయాలకు సన్యాసం తీసుకున్నా.. ప్రజల్లో ఇంకా పేరు మాత్రం నానుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను బట్టి చూసినట్లయితే లగడపాటి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చి తిరిగి కీలకమైన నేతగా మంచి ప్రచారం పొందనున్నట్లే తెలుస్తుంది. లగడపాటి పునర్వైభవం దక్కాలంటే మంచి పార్టీలోనూ.. దానికి తోడు తనకు ఇదివరకే బాగా కలిసొచ్చిన, స్థానికంగా తనకంటూ గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రాంతంలో నుండి పోటీ చేసి ఆ రకంగా గత వైభవాన్ని మళ్ళీ చాటాలని చూస్తున్నట్లుగా కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో లగడపాటి చూపు వైకాపా వైపు మళ్ళినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా లగడపాటి వైకాపాకు దగ్గరయ్యేందుకు తగు ప్రయత్నాలు ఇప్పటికే మొదలెట్టినట్లు కూడా తెలుస్తుంది. తాజాగా లగడపాటి వైకాపా అధినేత జగన్‌తో భేటీ జరిపాడు. సుమారు గంట సేపు సాగిన వీరిరువురి భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి లగడపాటి త్వరలోనే వైకాపా కండువాను పుచ్చుకొనే ఉద్దేశంలో ఉన్నట్లుగా కూడా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. లగడపాటి ఇప్పటికిప్పుడు వైకాపాలోకి రాకపోయినా సాధారణ ఎన్నికల నాటికి వైకాపాలోకి లగడపాటి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది.
అయితే లగడపాటి వైకాపాలోకి వస్తే అటు జగన్ కి కూడా ప్లస్సే అవుతుంది. ఏ రకంగా చూసుకున్న నేతల పరంగానూ, సామాజిక వర్గాల అంచనా పరంగాను వైకాపా బలోపేతానికి లగడపాటి వైకాపాలోకి ఎంట్రీ జగన్ కు బాగా కలిసొచ్చేట్టుగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే వైకాపాలో ఇంతకాలం రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే పేరు కూడా ఈయన పార్టీ ఎంట్రీ ద్వారా తగ్గుతుంది. ఇప్పటివరకు రెడ్డి, మైనారిటీలు, క్రిస్టియన్లకు మాత్రమే వైకాపా ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఎన్నికల నాటికి సమ ప్రాధాన్యత దిశగా వైకాపాను నడిపించే ఉద్దేశంతో గత ఎన్నికల కంటే ఇప్పుడు జగన్ ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.