Advertisementt

నిహారికకు కూడా తప్పడం లేదు..!

Sat 18th Feb 2017 09:26 PM
niharika,oka manasu,bullithera,niharika movies,kollywood  నిహారికకు కూడా తప్పడం లేదు..!
నిహారికకు కూడా తప్పడం లేదు..!
Advertisement
Ads by CJ

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన పెద్దలు చెప్పే మాట సత్యం. మన తెలుగువారి టాలెంట్‌ మనకు తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో తెలుగు సినీ పరిశ్రమ ఈ విషయాన్ని నిరూపిస్తూనే ఉంది. ఎంత బ్యాగ్రౌండ్‌ఉన్నా, టాలెంట్‌ ఉన్నా కూడా తెలుగమ్మాయిలకు మన పరిశ్రమ ప్రోత్సాహం ఇవ్వదు. గతంలో కృష్ణ కూతురు మంజుల, అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ వంటి వారి విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు మెగాడాటర్‌ నిహారిక విషయంలో ఇది మరోసారి ప్రూవ్‌ అయింది. దీనికి ఓ విధంగా మెగాభిమానులు, వారి యాంటీ ఫ్యాన్స్‌ ఓవర్‌యాక్షన్‌ కూడా కారణమే. యాంటీ ఫ్యాన్స్‌ ఒకరకంగా విమర్శిస్తే, సొంత అభిమానులు కొంచెం అసభ్యంగా కనిపించినా వారి సొంత ఫ్యామిలీ పరువు పోయినట్లు ఫీలవుతారు. హీరోలను వారసులుగా ఆరాధించే ఈ ఫ్యాన్స్‌ వారసురాళ్ల విషయంలో మాత్రం సంకుచితంగా ఆలోచిస్తారు. స్వయాన కృష్ణ కుమార్తె మంజులకు బాలకృష్ణ హీరోగా ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినప్పటికీ ఘట్టమనేని ఫ్యాన్స్‌ ఒత్తిడి వల్లే కృష్ణ అందుకు అంగీకరించలేకపోయాడు. ఆయనకు ఇష్టమున్నా కూడా ఫ్యాన్స్‌ మాటకు తలొగ్గాడు. 

ఇక టాలెంట్‌ ఉన్నప్పటికీ అంజలి, శ్రీదివ్య, కలర్స్‌ స్వాతి వంటి వారిని మన ఇండస్ట్రీ ఆదరించలేదు. తమిళ ప్రజలు, ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ప్రస్తుతం మెగాడాటర్‌ అనే బిరుదే నిహారిక కొణిదెలకు కూడా శాపంగా మారిందా? అనిపిస్తోంది. ఇప్పుడు ఆమె కూడా చెన్నై ఫ్లైట్‌ ఎక్కేసింది. ఇక నిహారిక కూడా ఎలాంటి అనుభవం లేకుండానే 'ఒక మనసు' లో హీరోయిన్‌ అయిపోలేదు. తన టాలెంట్‌ ద్వారా బుల్లితెరను మెప్పించింది. ప్రస్తుతం కూడా 'నాన్న కూచి' అనే వెబ్‌సిరీస్‌ చేస్తోంది. ఇక్కడ నిహారిక విషయంలో మెగాఫ్యామిలీ తీరును కూడా తప్పుపట్టాలి. నిహారిక హీరోయిన్‌గా నటిస్తే హీరోగా మేము చేయమని కొందరు యువహీరోలు బహిరంగంగానే చెబుతున్నారట. దానికి కారణం నిహారిక మొదటి చిత్రం 'ఒక మనసు' చిత్రంలో జరిగిన ప్రమోషన్‌ ఓ ఉదాహరణ. నాగశౌర్యను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయన్ను చిన్న చూపు చూసి అందరూ చివరకు మీడియా కూడా నిహారికనే హైలైట్‌ చేసింది. సో.. వీటితోపాటు తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రాకపోవడానికి, ఇతర తమిళ, మలయాళ పరిశ్రమల్లో ప్రోత్సాహం లభించడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిని చర్చించడం కంటే నిహారిక కోలీవుడ్‌లోనైనా హిట్‌ కావాలని కోరుకుందాం....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ