Advertisementt

పవన్‌ ఊసెత్తందే వర్మ వుండలేడు..!

Sat 18th Feb 2017 05:41 PM
pawan kalyan,ram gopal varma,twitter  పవన్‌ ఊసెత్తందే వర్మ వుండలేడు..!
పవన్‌ ఊసెత్తందే వర్మ వుండలేడు..!
Advertisement
Ads by CJ

మొత్తానికి వర్మను అటు నాగబాబు, ఇటు పవన్‌కళ్యాణ్‌లు బాగానే ఆడుకున్నారు. దాంతో ఇకనైనా ఆయన పవన్‌ గురించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడేమో అని చాలా మంది భావించారు. కానీ నిత్యం వార్తల్లో ఉండాలనుకునే వర్మకు మాత్రం పవన్‌ నామస్మరణ లేకుండా నిద్ర పట్టేటట్లు లేదనే విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల కొంత కాలంగా వర్మ పవన్‌కు, మెగాఫ్యామిలీకి కాస్త రెస్ట్‌ ఇచ్చాడు. మరలా తాజాగా ఆయన పవన్‌ను, ఆయన అభిమానులను గిచ్చి రచ్చ చేయడానికి సిద్దమైపోతున్నాడేమో అనిపించకమానదు. తాజాగా వర్మ పవన్‌ చిన్నప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే నేర్చుకున్నప్పటి ఫోటోలను, తాను నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ ఫొటోలను కలిపి ట్విట్టర్‌లో పెట్టాడు. ఇంకా కామెంట్స్‌ మొదలు పెట్టకపోయినా మద్యలో తన ఫొటోతో పాటు పవన్‌ ఫొటోని కూడా ఎందుకు పెట్టాడా? అని మెగాభిమానులు జట్టు పీక్కుంటున్నారు. ఈసారి మాత్రం తమ హీరో ఏమి అనకపోయినా తామే వర్మను పవర్‌ పంచ్‌లతో దెబ్బతీయాలని పవన్‌ ఫ్యాన్స్‌ సిద్దమవుతున్నారు. కానీ ఎదురుగా ఉన్నది మెంటల్‌ కృష్ణ అని మాత్రం మర్చిపోవద్దు సుమా....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ