Advertisementt

'2.0' కి ఈ ఫైటే హైలెట్ అంటున్నారు..!

Sat 18th Feb 2017 10:12 AM
tamil supaer star,rajinikanth,robo 2,2.0 movie,director shankar,vilain akshay kumar  '2.0' కి ఈ ఫైటే హైలెట్ అంటున్నారు..!
'2.0' కి ఈ ఫైటే హైలెట్ అంటున్నారు..!
Advertisement
Ads by CJ

రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్ గా అమీ జాక్సన్ హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 2 .0 . ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు 300  కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెబుతున్నప్పటికీ దీని బడ్జెట్ మాత్రం 500  కోట్ల వరకు వుంటుందనే ప్రచారం మొదలైంది. అయితే అది కేవలం ప్రచారం మాత్రమే కాదు అదినిజమనిపించేలా శంకర్ ఈ సినిమాకు ఖర్చు పెడుతున్నాడని అంటున్నారు. ఉదాహరణకి రజినీకాంత్ కి అక్షయ్ కుమార్ కి మద్యన జరిగే ఒక్క ఫైట్ కోసమే 12  కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల మధ్య ఫైట్  సీన్‌ని ఏరియల్ స్టంట్ విధానంలో డైరెక్టర్ శంకర్ చిత్రీకరిస్తున్నాడని  సమాచారం. రోబో 2 .0  చిత్రానికి ఈ ఫైట్ నే హైలెట్ అని చెబుతున్నారు. 

ఈ ఫైట్ కోసం హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్లు ని ముంబైకి రప్పించారని చిత్ర యూనిట్ చెబుతోంది. హాలీవుడ్ చిత్రాలను తలదన్నే రీతిలో ఈ రోబో 2 .0  చిత్రంలో ఈ ఫైట్ సీన్ ఉంటుందని అంటున్నారు. ఇక షూటింగ్ ని శరవేగంగా జరుపుతూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. మరి రజినీకాంత్  హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు వున్నాయి. అందులోను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ రోల్ పోషిస్తుండడంతో ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఎవరివల్ల కాదనే మాట వినబడుతుంది. ఇకపోతే తమిళ సంవత్సరాదికి టీజర్ ని విడుదల చేసి వచ్చే దీపావళికి సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ