హీరోలకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయేమో గానీ హీరోయిన్లకు మాత్రం 10 ఇయర్స్ ఇండస్ట్రీనే ఓ పెద్ద చాలెంజ్. రోజుకో కొత్త హీరోయిన్, కొత్త అందాలు పరిచయమయ్యే సినిమా ఫీల్డ్‌లో హీరోయిన్లు పదేళ్ల కెరీర్‌ను నిలబెట్టుకోవడం మాటలు కాదు. కాగా అమ్మడు కాజల్ అగర్వాల్ ఈ రేర్ ఫీట్‌ను సాధించింది. 2007లో కళ్యాణ్‌రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీకళ్యాణం' ద్వారా ఈ భామ టాలీవుడ్‌కు పరిచయమైంది. మొదటి చిత్రం పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు రాలేదు. కాగా కృష్ణవంశీ తెరకెక్కించిన 'చందమామ' చిత్రంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది.
ఇక 'మగధీర' చిత్రం ద్వారా ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగులోని స్టార్స్ అందరితో ఈమె చిత్రాలు చేసింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అందరు టాప్ హీరోలతోనూ నటించి చిరు. పవన్, చరణ్... ఇలా వయోభేదం, వరస భేదం లేకుండా అందరి సరసన నటించింది. ఇక ఈమె ప్రస్తుతం తన మొదటి చిత్రం దర్శకుడు తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న 'నేనే రాజు.. నేనే మంత్రి' చిత్రంతో పాటు తమిళంలో అజిత్‌తో 'వివేగం', విజయ్61వ చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తోంది. తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలు, పెర్ఫార్మెన్స్ పాత్రలు రెండింటిని ఆమె చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే వెలుగొందుతోంది. మరి ఈమె జర్నీ మరింతె కాలం ఉంటుందో వేచిచూడాల్సివుంది.....!