చిరంజీవి కామ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' చిత్రం మొదలైనప్పటి నుండి.... విడుదలై రికార్డు కలెక్షన్స్ సాధించే వరకు మెగా అభిమానులకి నిద్ర లేదు. తమ అభిమాన హీరో చిత్రాన్ని ఆ విధంగా మౌత్ టాక్ తో సూపర్ హిట్ చేసేశారు. అయితే 'ఖైదీ...' చిత్రానికి మొదటి నుండి పబ్లిసిటీ పై అంతగా ఫోకస్ చెయ్యలేదు చిత్ర నిర్మాత రామ్ చరణ్. కేవలం చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో ఎలా కనబడతాడో అనే క్యూరియాసిటీతోనే ఈ సినిమాకి పబ్లిసిటీ లేకపోయినా హిట్ చేసేశారు. అసలు పబ్లిసిటీ అంటే ఏమిటి ఆ చిత్రానికి సంబందించి ఆడియో ఫంక్షనో లేక ట్రైలర్ లాంచో లేక సక్సెస్ మీట్ లేక ఒక్క థాంక్స్ మీట్ అలాంటి పబ్లిసిటీలతోనే సినిమా సగం సక్సెస్ సాధిస్తుందనేది అందరికి తెలిసిన నిజం.
అయితే చిరు 'ఖైదీ నెంబర్ 150' కి మాత్రం ఆడియో జరుగుతుంది జరుగుతుంది అని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసి కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రమే ఉంటుందని చెప్పారు. ఇంకా ఆ ఫంక్షన్ కూడా విజయవాడలో కాకుండా విజయవాడ సమీపంలోని హాయిలాండ్ లో నిర్వహించారు. కానీ ఆ ఫంక్షన్ న్నీ కేవలం కొన్ని గంటల్లో హడావిడిగా ముగించి మెగా అభిమానులను నిరాశలోకి నెట్టేశారు. పోన్లే మన మెగా స్టారే కదా సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్ ఫంక్షన్ ని భారీగా చేసుకుందామని సర్దుకుపోయారు. ఇక సినిమా విడుదల కావడము అది కాస్త హిట్ అవడము జరిగి అప్పుడే రెండు నెలలు కావొస్తున్నా 'ఖైదీ...' సక్సెస్ మీట్ గురించి గాని థాంక్స్ మీట్ గురించిగాని ఎక్కడా వినబడడం లేదు.
సినిమా విడుదలై కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నప్పుడు 'ఖైదీ...' థాంక్స్ మీట్ భారీ లెవెల్లో ఉంటుందని చెప్పిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అయితే ఆ మధ్యన 'ఖైదీ నెంబర్ 150' థాంక్స్ మీట్ ఇదిగో అని అదిగో అని అన్నారు కానీ ఇప్పుడు కామ్ అయిపోయారు. అయినా సినిమా విడుదలై కలెక్షన్స్ వర్షం కురిపించేసి ఇప్పుడు జోరు తగ్గిపోయాక ఇంకా థాంక్స్ మీట్ ఎందుకులే అనుకున్నారేమో చిరు అండ్ ఫ్యామిలీ. అందుకే ఇక 'ఖైదీ....' ఫంక్షన్ గురించి ఆలోచించడం కూడా మానుకున్నట్లు సమాచారం. పాపం మెగా ఫ్యాన్స్ ఈ సారైనా 'ఖైదీ...' ఫంక్షన్ లో సందడి చేద్దామనుకుని ఇప్పుడు ఉసూరుమంటున్నారని అంటున్నారు.