Advertisementt

ఈ ప్రోగ్రాంలో విజేత చిరునా? లేక నాగ్ నా?

Thu 16th Feb 2017 02:54 PM
nagarjuna,chiranjeevi,mek tv show,mega fans  ఈ ప్రోగ్రాంలో విజేత చిరునా? లేక నాగ్ నా?
ఈ ప్రోగ్రాంలో విజేత చిరునా? లేక నాగ్ నా?
Advertisement
Ads by CJ

నాగార్జున హోస్ట్‌ చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తాజా సీజన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ షోలోని మొదటి ఎపిసోడ్‌లో చిరు బాగానే అలరించాడు. మొదటి కంటెస్టెంట్‌ అయిన సోమిరెడ్డితో సమయస్ఫూర్తితో మాట్లాడాడు. కార్యక్రమం ప్రారంభంలో కాస్త తడబాటుకు చిరులోనైన విషయం తెలిసిందే. కానీ ఆ వెంటనే కార్యక్రమంలో లీనమై, ప్రొగ్రాంను రక్తికట్టించడంలో సక్సెస్‌ అయ్యాడు, కావాల్సినంత భావోద్వేగాలను ప్రదర్శిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. కాగా ఈ కార్యక్రమం వారంలో నాలుగురోజుల పాటు స్టార్‌ మాలో ప్రసారమవుతుంది. అంటే వారానికి నాలుగుసార్లు మెగాస్టార్‌ చిరంజీవి బుల్లితెరపై ఇంట్లోనే సందడి చేయనుండటంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇక ఈ ప్రోగ్రాంను చూసి బాగా చేశావని బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ తనను మెచ్చుకున్నారని, కాబట్టి తాను దానిని ఓ 

సర్టిఫికేట్‌గా భావిస్తానని చిరు చెప్పాడు. ఇక ఈ ప్రోగ్రాం డిజైనర్‌ అయిన సిద్దార్ద్‌బసు కూడా దీనిలో తాను బాగా చేశానంటూ ప్రశంసించాడని చిరు చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో నాగార్జున బాగా మెప్పించాడా? లేక చిరు బాగా చేస్తున్నాడా? అని ఇప్పటికిప్పుడు అంచనాకు రాలేమని, దానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ ప్రోగ్రాంలో హోస్ట్‌ విజేత చిరునా? లేక నాగా? అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్‌ చేయాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ