'సర్దార్‌గబ్బర్‌సింగ్' వంటి డిజాస్టర్ తర్వాత పవన్ చేస్తోన్న చిత్రం 'కాటమరాయుడు' కాగా శృతిహాసన్ ఇందులో పవన్ సరసన మరోసారి నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అందరినీ ఎంతగానో అలరిస్తోంది. కాగా ఇప్పటికి రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలో దీనిని కూడా పూర్తి చేసి మార్చి నెలలోనే పాటలను విడుదల చేస్తారు. మొదటి కాపీ మార్చి10వ తేదీ నాటికే పూర్తవుతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. కాగా ఈ చిత్రం ఓవర్‌సీస్ రైట్స్‌ను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 11కోట్లకు పైగా వెచ్చించి, సొంతం చేసుకుందని సమాచారం.
కాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 28న విడుదల చేయాలని భావించారు. అయితే ఈ చిత్రాన్ని ఓ వారం ముందుగానే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోపక్క ఈచిత్రం తర్వాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు, ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఇప్పటికే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు.ఇక మార్చి 14 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందంటున్నారు. మొత్తానికి పవన్ ఈ ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమంటున్నారు.