మెగామేనల్లుడిగా తక్కువ చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకుని స్టార్‌ఇమేజ్ వైపు అడుగులు వేస్తోన్న హీరో సాయి ధరమ్‌తేజ్. కాగా త్వరలో ఆయన నటించిన 'విన్నర్' చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రంలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఇటీవల సోషల్ మీడియాలో సాయి భలే యాక్టివ్‌గా ఉన్నాడు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అనాధల బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకోవడంపై ఈయన హర్షం వ్యక్తం చేశాడు. తాజాగా ఇస్రో ఈరోజు రోదసీలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలను మోసుకెళ్లి తన ప్రయత్నంలో ఘన విజయం సాధించి, ప్రపంచరికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా మన శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దీనిపై సాయి కూడా స్పందించాడు. '100కు పైగా శాటిలైట్లను లాంఛ్ చేయడం మాకు కాపీ కొట్టినంత ఈజీ అని రుజువు చేసిన శాస్త్రవేత్తలకు థ్యాంక్స్.... దేశమంతా గర్వించేలా, ప్రతి భారతీయుడులు ఉప్పోంగి, గర్వపడేలా చేశారని ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తానికి అన్ని విషయాలపై స్పందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ మెగామేనల్లుడిపై ఇప్పుడు మంచి ప్రశంసలు కురుస్తున్నాయి.