తమిళ పక్కా మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి. రేసీ స్క్రీన్‌ప్లేతో, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్‌ని కలిపి ఆయన కమర్షియల్ చిత్రాలను తీయడంలో సిద్దహస్తుడు. కాగా ఆయన ఇప్పటి వరకు తన కెరీర్‌లో 14 చిత్రాలను మాత్రమే దర్శకత్వం చేశాడు. గతంలోనే ఆయన టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, బాలకృష్ణలకు స్టోరీలు వినిపించాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఒకానొక సమయంలో మీడియా వారు మీరు ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నారా? అని ప్రశ్నిస్తే ఎన్టీఆర్ అంటే ఎవరో గుర్తుకు రావడం లేదన్నాడు.
కానీ ప్రస్తుతం 'ఎస్3' చిత్రం రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ కోసం మన హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా మాత్రం తనకు ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' చిత్రం అంటే చాలా ఇష్టమని, తనకు అవకాశం ఇస్తే ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయాలనుందని తెలిపాడు. గతంలో ఎన్టీఆర్‌తో ఓ చిత్రం విషయమై డిస్కస్ చేసినా కూడా అది మెటీరియలైజ్ కాలేదన్నాడు. విశాల్, సూర్య, విక్రమ్ వంటి స్టార్స్‌కు బ్లాక్‌బస్టర్స్ అందించిన హరి విజయ్, అజిత్‌లతో చిత్రాలు చేయలేదు. త్వరలో వారితో కూడా చిత్రాలు చేయనుందని తెలిపాడు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ తమిళ దర్శకులపై ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాబి, ఆ తర్వాత త్రివిక్రమ్, ఆ వెంటనే వినాయక్‌లతో ఆయన వరుస చిత్రాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా 'ఎస్3' చిత్రం తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నప్పటికీ తమిళంలో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. దాంతో సూర్య దర్శకుడు హరికి 50లక్షల విలువ చేసే ఓ ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.