సంక్రాంతికి విడుదలైన మూడు చిత్రాల వారు తమ చిత్రం ఇంత కలెక్ట్ చేసిందంటే... అంత కలెక్ట్ చేసిందంటూ లెక్కలు గొప్పగా చెప్పుకుంటున్నారు. దీంతో తమ చిత్రమే ఎక్కువ కలెక్ట్ చేసిందంటే... కాదు... మా హీరో చిత్రమే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిందని అభిమానులు వాదించుకుంటున్నారు. ఒకరివి ఒకరు ఫేక్ కలెక్షన్లని నిందించుకుంటున్నారు. కాగా బాలయ్య 'గౌతమీపుత్ర...' చిత్రం కలెక్షన్లపై మాత్రం ఇప్పుడు ట్రేడ్‌వర్గాల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం విడుదలకు ముందే లాభాలను చవిచూసింది. నిర్మాతలు లాభపడ్డారు.
కానీ చిత్రం ఇండియా వైడ్‌గా ఇప్పటివరకు కేవలం 60కోట్ల గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసిందంటూ కొన్ని మీడియా చానెల్స్‌లో, వెబ్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారు ఎక్కడ ఎంత కలెక్ట్ చేసిందో కూడా లెక్కలు చూపుతున్నారు. దాంతో బాలయ్య అభిమానుల్లో గండరగోళ పరిస్థితి నెలకొంది. ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు వంటివి లభించినందు వల్ల ఈ చిత్రం ద్వారా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలే వచ్చాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం ప్రతిష్టాత్మక చిత్రం కావడం, హిస్టారికల్‌మూవీగా భారీ బడ్జెట్‌తోనే నిర్మించినందువల్ల ఈ కొద్దిపాటి లాభాలు నిర్మాతలకు, బయ్యర్లకు సంతృప్తినివ్వలేదనే ప్రచారం కొనసాగుతోంది. కాగా ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో మాత్రం 7కోట్లకు పైగా వసూలు చేసి మంచి లాభాలను తీసుకొచ్చిందని చెబుతున్నారు.
ఏదిఏమైనా ఈ చిత్రం క్రిష్‌కు మాత్రం నూతనోత్తేజాన్నిచ్చిందని అంటున్నారు. త్వరలో వెంకటేష్‌తో ఆయన 75వ చిత్రానికి స్టోరీని తయారు చేసుకుంటున్న క్రిష్ ఇప్పుడు మరో రెండు బయోపిక్స్‌కు కూడా రీసెర్చ్ చేస్తున్నాడు. అందులో ఒకటి 'శ్రీకృష్ణదేవరాయలు' కాగా రెండోది 'గౌతమ బుద్దుడు' జీవిత చరిత్ర.'గౌతమీపుత్ర...' స్టోరీ ప్రజలకు పెద్దగా పరిచయం లేని సబ్జెక్ట్. కానీ శ్రీకృష్ణదేవరాయలు, గౌతమ బుద్దుని జీవిత చరిత్రలు మాత్రం అందరికీ చిరపరిచితమే. కాగా ఇప్పటికే 'ఆదిత్య369'లో బాలయ్య కాసేపు శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించి, మెప్పించాడు. మరి ఈ రెండు కొత్త బయోపిక్స్ కోసం క్రిష్ ఎవరిని హీరోలుగా తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది...!