Advertisementt

వీడెవడు... సస్పెన్స్ కి తెరతీశారు..!

Wed 15th Feb 2017 01:04 PM
veedevadu movie,hero sachiin joshi,akkineni nikhil  వీడెవడు... సస్పెన్స్ కి తెరతీశారు..!
వీడెవడు... సస్పెన్స్ కి తెరతీశారు..!
Advertisement
Ads by CJ

ఆ మధ్యన అఖిల్ 'వీడెవడు' అంటూ ఒక వెనక్కితిరిగి ఉన్నపోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.... ఒక బాలీవుడ్ స్టార్, అందులోను ఒక క్రీడాకారుడు అంటూ ట్వీట్ చేసి అందరిని సస్పెన్స్ లో పడేసాడు. గత కొద్దీ రోజులుగా ఆ పోస్టర్ గురించి రకరకాల ఊహగానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అసలు ఆ పోస్టర్ లో వున్న హీరో ఎవరూ అంటూ చర్చ మొదలెట్టారు. అసలు 'వీడెవడు' అంటూ అందరిని ఆలోచనలో పడేసిన అఖిల్... 'వీడెవడో..' అనేది చిత్ర యూనిట్ రివీల్ చేసేసింది. ఆ 'వీడెవడు' చిత్ర పోస్టర్లో వున్నది వాడెవడో కాదు సచిన్ జోషి. వేలంటైన్స్ డే సందర్భం గా ఈ చిత్ర యూనిట్ విడుదల చేసిన 'వీడెవడు' లుక్ లో ఉన్నది సచిన్ జోషి అని అందరికి తెలిసేలా చేసారు. 

ఇక సచిన్ జోషి గురించి అఖిల్ అంతలా ప్రచారం చెయ్యడానికి వీరిద్దరికి టాలీవుడ్ క్రికెట్ ఆడే టైములో ఉన్న పరిచయమేనట. అందుకే అఖిల్ ఆ పోస్టర్ గురించి అంతలా జనాల్లో క్యూరియాసిటీ పెంచేసాడు. అయితే సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. ఇంతకుముందే తెలుగులో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న సచిన్ ఇప్పుడు మళ్లీ 'వీడెవడు' అంటూ వస్తున్నాడు. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ తో అఖిల్ వంటి యాంగ్ స్టార్ తో పబ్లిసిటీ అయితే జరిగింది గాని వీడెవడు చిత్రం కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా? లేదా? లేకుంటే అతని గత సినిమాల వలే మళ్లీ జరుగుతుందా? అనేది 'వీడెవడు' చిత్రం విడుదల వరకు వేచిచూడాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ