నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని ఇప్పటివరకు ఏ ఇమేజ్ ఛట్రంలోనూ ఇరుక్కోలేదు. డిఫరెంట్ చిత్రాలను చేస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన 'నేను..లోకల్' చిత్రం విడుదలైంది. ఇంతకాలం నానికి లాంగ్‌రన్‌లో మంచి లాభాలు మాత్రమే వచ్చేవి. కానీ 'నేను...లోకల్' చిత్రం ఓపెనింగ్స్‌తోనే అదరగొట్టింది. కేవలం మొదటి 10రోజుల్లో ఏకంగా 26కోట్ల షేర్‌ను వసూలు చేసిందని ట్రేడ్‌వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. కాగా ఈ చిత్రానికి మొదటి రోజు నుండి డివైడ్ టాక్ వస్తోంది. సినిమా చాలా రొటీన్ అనే విమర్శలు వస్తున్నాయి. అయినా విమర్శలకు, డివైడ్‌టాక్‌కు సంబంధం లేకుండా నాని నటించిన ఈ చిత్రం విజయభావుటా ఎగురవేస్తూ నాని రేంజ్‌ను మరింతగా పెంచింది.
వాస్తవానికి ప్రతిహీరోకు మాస్‌ఇమేజ్ తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎందరో నష్టపోయి, కెరీర్‌ను చెడగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇక నాని విషయానికి వస్తే ఇప్పటివరకు భిన్న చిత్రాలను చేస్తూ వస్తున్న ఆయన తాను ఇప్పటివరకు చేయని పూర్తి మాస్ యాక్షన్ బాటలో 'నేను...లోకల్' చేశాడు. దీనిని ప్రేక్షకులు అభిమానిస్తున్నారు. దీంతో ఆయన ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తన చిత్రాలను వరుసగా ఆదరిస్తూ, తనను ఎవ్వరూ ఊహించని స్థానంలో కూర్చొబెట్టారని, ఇప్పుడు తనపై మరింత బాధ్యత పెరిగిందని, దానిని తలుచుకుంటేనే భయమేస్తోందన్నాడు. అయినా ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెడతానంటూ ప్రస్తుతం తాను శివ శంకర్ అనే కొత్త దర్శకునితో చేస్తున్న చిత్రం అమెరికాలో షూటింగ్ జరుగుతుండగా, అక్కడి నుండి స్పందిస్తున్నానన్నాడు. ఇక ఈ చిత్రం కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని, ఈ చిత్రానికి 'మాస్ హీరో' అనే టైటిల్‌ను పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో నానికి అక్కగా నిన్నటితరం ప్రేక్షకులను 'ఖుషీ' చేసిన ముద్దుగుమ్మ భూమిక నటిస్తోందని సమాచారం.