Advertisementt

మహేష్‌కు సవాల్‌ విసురుతోన్న బన్నీ..!

Tue 14th Feb 2017 06:12 PM
mahesh babu,allu arjun,muragaadas,puri,dj movie,sambhavami movie  మహేష్‌కు సవాల్‌ విసురుతోన్న బన్నీ..!
మహేష్‌కు సవాల్‌ విసురుతోన్న బన్నీ..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌ యంగ్‌స్టార్స్‌లో మహేష్‌, పవన్‌లు తీవ్రంగా పోటీపడుతున్నారు. కానీ మరోపక్కన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ వంటి స్టార్స్‌ కూడా చాప కింద నీరులా తమ సత్తా చాటడానికి సిద్దపడుతున్నారు. ఇప్పటికే 'టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌'లతో భారీ హిట్లను ఎన్టీఆర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు 'రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు' వంటి వరుస హిట్లతో బన్నీ అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. 

ఇక మహేష్‌ విషయానికి వస్తే 'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌ తన శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. మంచి మెసేజ్‌ చిత్రాల వైపు ఆయన బాగా మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న మురుగదాస్‌ చిత్రం 'సంభవామి' (వర్కింగ్‌ టైటిల్‌) కూడా దేశభక్తితో సాగే సబ్జెక్ట్‌ అని సమాచారం. దీని తర్వాత మహేష్‌ మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో రెండో చిత్రం చేయనున్నాడు. ఇది నీతివంతుడైన రాజకీయనాయకుడి గురించి అని, ఈ చిత్రంలో మహేష్‌ ముఖ్యమంత్రిగా నటించనున్నాడని, అందుకే ప్రమాణస్వీకారాలలో చెప్పే 'భరత్‌ అను నేను...'ను టైటిల్‌గా పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క 'రేసుగుర్రం' లాంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, 'సరైనోడు' వంటి ఊరమాస్‌ చిత్రాలను చేస్తోన్న బన్నీ కూడా విభిన్న కథాంశాలు, టైటిల్స్‌ను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన 'డిజె' (దువ్వాడ జగన్నాథం)అనే వెరైటీ టైటిల్‌తో చిత్రం చేస్తున్నాడు. 

ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ, తాను మాత్రం రిస్క్‌ తీసుకోకుండా ఆ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌కు ఇచ్చి మరో చిత్రం చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇక వక్కంతం చిత్రానికి 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు తెలుస్తోంది. పూరీ-నాగ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'శివమణి' చిత్రంలో నాగ్‌ 'నా పేరు శివమణి.. నాకు కొంచెం....' అనే డైలాగ్‌ హైలైట్‌. ఆమధ్య కార్తి నటించిన ఓ డబ్బింగ్‌ చిత్రానికి 'నా పేరు శివ' అనే పేరును పెట్టారు. ఇప్పుడు బన్నీ కూడా అదే స్టైల్‌లో వెళ్తున్నాడు. ఇక ఈ చిత్రం కూడా మహేష్‌ రాబోయే చిత్రాలలాగానే ఓ విభిన్నమైన సామాజిక సందేశం, దేశభక్తి నిండిన చిత్రంగా రూపొందునుందని తెలుస్తోంది. మొత్తానికి మహేష్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి బన్నీ కూడా మొదటిసారి పూర్తిస్థాయి సందేశాత్మక చిత్రం చేస్తూన్నాడు. మరి వీరి ప్రయత్నాల్లో ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ