Advertisementt

మరోసారి మెగాభిమానులకు నిరాశతప్పదు..!

Tue 14th Feb 2017 04:49 PM
chiranjeevi,pawan kalyan,t.subbarami reddy,multi starrer movie,mega fans  మరోసారి మెగాభిమానులకు నిరాశతప్పదు..!
మరోసారి మెగాభిమానులకు నిరాశతప్పదు..!
Advertisement
Ads by CJ

ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత, రాజకీయనాయకుడు, బడా కాంట్రాక్టర్‌ అయిన టి.సుబ్బిరామిరెడ్డి ఇటీవల చిరంజీవి మరలా హీరోగా రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించి, ఆ తర్వాత చిరు-పవన్‌లతో కలిసి మల్టీస్టారర్‌ చేస్తున్నానని, దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నాడని, ఇప్పటికే త్రివిక్రమ్‌తో కథా చర్చలు జరిపానని తెలిపాడు. కానీ ఆయన ఇలాంటి పలు సంచలన కాంబినేషన్స్‌ను గతంలో కూడా ప్రకటించి, వాటిని సెట్స్‌పైకి తీసుకోని పోలేదు. దీంతో ఆయనను బాగా ఎరిగిన వారు మాత్రం ఇది కేవలం సుబ్బి చేస్తున్న ఓ సంచలనంగా మాత్రమే అనుకొని లైట్‌గా తీసుకున్నారు. 

కానీ మెగాభిమానులు మాత్రం తమ అభిమాన హీరోలైన మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌లు కలిసి ఒకే చిత్రంలో నటిస్తున్నారని, ఆ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అదే సందర్భంగా మీడియాలో, సినీ విశ్లేషకుల్లో ఇది జరిగే పని కాదని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమవుతున్నాయి. తాజాగా అమెరికాలో ఉన్న పవన్‌ను అక్కడ ఓ విలేకరి 'త్వరలో మీరు మీ అన్నయ్యతో కలిసి నటిస్తున్నారా? అని ప్రశ్నిస్తే.. పవన్‌ వెంటనే నవ్వి'నా వద్దకు అలాంటి ప్రపోజల్‌ ఎవ్వరూ తేలేదని తేల్చేశాడు. దీన్ని బట్టి వార్తల్లో నిలబడటం కోసం సుబ్బరామిరెడ్డి వంటి వారు చేసే జిమ్మిక్కులను ఇకపై నమ్మకుండా ఉంటేనే బాగుంటుందని మెగాభిమానులు కూడా తమలో తాము చర్చించుకుంటున్నారు. మొత్తానికి మెగాభిమానులకు ఇది నిరాశను కలిగించే విషయమేనని చెప్పాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ