Advertisementt

సినిమా కథకి తక్కువ కాకుండా...!

Tue 14th Feb 2017 01:16 PM
tamil nadu politics,pannerselvam,sasikala,sasikala harassed  సినిమా కథకి తక్కువ కాకుండా...!
సినిమా కథకి తక్కువ కాకుండా...!
Advertisement
Ads by CJ

తమిళనాట రాజకీయాలు ఏ సినిమాకి తక్కువ కాకుండా గత ఐదారు రోజుల నుండి రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళను ఎలాగైనా సీఎం పీఠం నుండి దూరం చెయ్యాలనే ఎత్తుగడ ఎట్టకేలకు ఫలించింది. తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, శశికళ పై అక్రమాస్తుల కేసు విచారణ జరిగి ఆ కేసు ఏదో ఒకటి తేలేవరకు పన్నీర్ సెల్వానికి గాని, శశికళను గాని తమిళనాడు సీఎం పదవిని అధిరోహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ లోపు ఎలాగైనా సీఎం కుర్చీ ఎక్కాలని శశికళ ఎమ్యెల్యేలను గోల్డెన్ రిసార్ట్స్ లో తన అధీనంలో ఉంచుకుని రోజు వారికి బ్రెయిన్ వాష్ చేస్తూ... వారిని పన్నీర్ వైపు వెళ్లకుండా దువ్వుతుంది. మరోవైపు డమ్మీ సీఎంగా పేరు తెచ్చుకున్న పన్నీర్ సెల్వం కూడా మూడో కన్ను తెరిచి శశికళను నిమిషం నిద్ర పోకుండా పోయెస్ గార్డెన్ నుండి తరిమేసి రాజకీయాలకు దణ్ణం పెట్టేలా పావులు కదుపుతున్నాడు. తనవైపు ఎంతమంది ఎమ్యెల్యేలు ఉన్నారన్నది ముఖ్యం కాదు నేనే తమిళనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని... నమ్మకంగా చెబుతున్నాడు. అంతా సినిమాటిక్ గా సాగుతున్న తమిళ రాజకీయాలు ఈ రోజు కోర్టు తీర్పుతో అనూహ్య మలుపు తిరగబోతున్నాయి. గత వారం నుండి తమిళనాడు గవర్నర్  విద్యాసాగర్ రావు ఎదురు చూస్తున్న కోర్టు తీర్పు రానే వచ్చింది.

శశికళ అడ్డంగా బుక్కైంది. కోర్టు తీర్పుతో శశి వర్గం బిత్తర పోయింది. ఆమెకి శిక్షని ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు సహనిందితులుగా వున్న మరో ముగ్గురికి ఈ రోజు కోర్టు శిక్ష ఖరారు చేసింది. జయలలిత చచ్చిపోయి ఈ కేసు నుండి తప్పించుకుంది గాని లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఆమె జైలు జీవితం గడపాల్సి వచ్చేది. ఇక జయ బదులు ఇప్పుడు ఆమె నెచ్చెలి శశికళ ఆ కోర్టు తీర్పు కి తలొగ్గి ఆమె జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఏ క్షణానైనా శశికళ అరెస్ట్ అయ్యే అవకాశాలు వున్నాయి. మరి శశికళ  సీఎం అవ్వాలని జయలలిత చనిపోయిన నాటి నుండి కలలు కంటూ నెమ్మదిగా పావులు కదుపుతున్న ఆమెకి చుక్కెదురైంది. సీఎం కుర్చీ ఆమెకి అందినట్టే అంది ఆలోపే చేజారిపోయింది. ఇక ఇప్పుడు జైలు కెళ్ళాల్సి రావడంతో ఇక ఇప్పట్లో సీఎం అయ్యే చాన్సు మాత్రం లేదు.

మరి సీఎం కుర్చీలో శశికళ వర్గం ఎవరిపేరు తెరపైకి తెస్తుందనేది ఇప్పుడు మరో ఉత్కంఠ. మరోవైపు కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేలు మాత్రం శశి చేతిలోనుండి జారిపోయి పన్నీర్ సెల్వం వైపువెళ్లిపోతారనే ప్రచారం మాత్రం ఊపందుకుంది. మరి ఇప్పుడు తమిళ రాజకీయాలు ఏమలుపు తీసుకోనున్నాయో అనేది మళ్ళీ సస్పెన్సు. మరోవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా సీఎం కుర్చీ మీద కన్నేసినట్లువార్తలొస్తున్నాయి. చూద్దాం డమ్మీ సీఎం పన్నీర్ ఇప్పుడైనా స్వతంత్ర సీఎంగా చక్రం తిప్పుతాడా.. లేదా అనేది కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ